వర్మ కోసం ఒంగోలు పోలీసులు(Ongole police) హైదరాబాద్, తమిళనాడులో వెతుకుతున్నారు.
తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu), ఆయన కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై(Pawan kalyan) సోషల్ మీడియాలో(Social media) అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై(Ram gopal varma) పోలీసులు కేసులు పెట్టిన సంగతి, వర్మ కోసం వెతుకున్న విషయం తెలిసిందే! అయితే వర్మ దాఖలు చేసిన ముందస్తు పిటిషన్లపై విచారణను హైకోర్టు(high court) రేపటికి వాయిదా వేసింది. వర్మ కోసం ఒంగోలు పోలీసులు(Ongole police) హైదరాబాద్, తమిళనాడులో వెతుకుతున్నారు. ఏపీ పోలీసులు కోయంబత్తూరుకు వెళ్లినట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు నోటీసులు పంపినా.. ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. నవంబర్ 25వ తేదీన తన ఎదుట హాజరు కావాలని విచారణాధికారి నోటీసులు పంపినా ఆయన రాలేదు. అయితే వర్మ సీనియర్ సిటిజన్ అని, ఆయనను స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపే రూలు లేదని, ఆయన నివాసంలోనే విచారణ జరపాలని కొందరు అంటున్నారు.