Ys Jagan : ఇండియా కూటమిలోకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌? ...జగన్‌ రియాక్షనేమిటి?

మొన్న దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(Ysr Congress Party) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(Ys Jagan Mohan Reddy) చేపట్టిన ధర్నా సక్సెసయ్యింది.

By :  Eha Tv
Update: 2024-07-26 11:57 GMT

Ys Jagan :ఇండియా కూటమిలోకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌? ... జగన్‌ రియాక్షనేమిటి?

మొన్న దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(Ysr Congress Party) అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(Ys Jagan Mohan Reddy) చేపట్టిన ధర్నా సక్సెసయ్యింది. ఈ ధర్నాకు జాతీయ పార్టీల నేతలు హాజరయ్యారు. అసలు ఇంత మంది వచ్చి సంఘీభావం తెలుపుతారని ఎవరూ ఊహించలేదు. మొదట లైట్‌ తీసుకున్న తెలుగుదేశంపార్టీ (Tdp)ఢిల్లీలో (Delhi)జగన్‌కు లభించిన మద్దతు చూసి ఆశ్చర్యపోయింది. ఇంత మంది జాతీయ నేతల మద్దతు జగన్‌ ఎలా కూడగట్టగలిగారా అన్న చర్చ మొదలయ్యింది. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)మినహా దాదాపు అన్ని పార్టీలు జంతర్‌ మంతర్‌(Jantar Mantar) దగ్గరకు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే జగన్‌ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. అధికారంలో ఉన్న అయిదేళ్ల పాటు జగన్‌ పరోక్షంగా బీజేపీకి(Bjp) మద్దతు పలికారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా జగన్‌ను విశ్వసించదగిన మిత్రుడిగానే పరిగణించింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆంధప్రదేశ్‌లో(andhra pradesh) ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జగన్‌ బీజేపీ వైపుకు వెళ్లలేరు. మిగిలింది కాంగ్రెస్‌ కూటమే! అయితే ఇండియా కూటమిలో చేరికపై జగన్‌ కొంత స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో ఫోటో, వీడియో గ్యాలరీలు ఏర్పాటు చేశామని, అవి చూసిన తర్వాత మాట్లాడలని తాము కోరినట్టు జగన్‌ చెప్పారు. ఇండియా కూటమిలో కొన్ని పార్టీలు వచ్చాయని, కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రంరాలేదని జగన్‌ తెలిపారు. కాంగ్రెస్‌ ఎందుకు రాలేదో ఆ పార్టీనే అడిగితే మంచిదని తెలిపారు. చంద్రబాబుతో(Chandrababu) కాంగ్రెస్‌కు ఉన్న సంబంధాలు ఏమిటో వారే చెప్పాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Cm Revanth)ద్వారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో ఎలా టచ్ లో ఉన్నారన్న విషయాన్ని కూడా కాంగ్రెస్‌నే అడగాలని తెలిపారు. మణిపూర్‌ (Manipur)అల్లర్లపై స్పందించే కాంగ్రెస్‌ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై ఎందుకు స్పందించదు? అని ప్రశ్నించారు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి.

Tags:    

Similar News