Chaganti vs Garikapati : గరికపాటిని తప్పించి చాగంటికి పదవి వచ్చేలా చేసిందెవరు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu) మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(chandrababu) మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చేశారు. ఇందులో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి(chaganti) కోటేశ్వరరావుకు కూడా ఓ పదవి దక్కింది. పైగా ఆది కేబినెట్ ర్యాంకు ఉన్న పదవి. నిజానికి ఈ పదవి గరికపాటి(Garikpati) నరసింహారావుకు దక్కాల్సి ఉండాలట! ఆయనకు ఆ పదవి దక్కకుండా చేసి, తెరమీదకు చాగంటి కోటేశ్వరరావును తీసుకొచ్చినది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) అట! పవన్ చెబితే చంద్రబాబు వింటారా? అంటే వినక తప్పదు మరి! పవన్‌ను మచ్చిక చేసుకోవడం ఇప్పుడు చంద్రబాబుకు చాలా అవసరం. ఎప్పుడు ఏ రకంగా ఉంటారో తెలియదు కాబట్టి! కోపం వస్తే ఏది పడితే అది మాట్లాడేస్తారన్న భయం కూడా చంద్రబాబులో ఉంది.. ఇక అసలు విషయానికి వస్తే, చాగంటికి దక్కిన పదవి ముందుగా ప్రతిపాదనలో ఉన్న పేరు గరికపాటి నరసింహారావు అని తెలిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాగంటి, గరికపాటి ఇద్దరూ ఫేమస్సే! ఇద్దరికి సమానమైన ఆదరణ ఉంది. గరికపాటి నరసింహారావులో లౌక్యం పాలు ఎక్కువ. ప్రవచనాలు చెప్పడంలో కాసింత ఫ్లెక్సబులిటీ ఉంటుంది. మూఢనమ్మకాలకు వ్యతిరేకి. మరోవైపు చాగంటి అలా కాదు. ఆయనలో చాదస్తం పాలు ఎక్కువగా ఉంటుంది. నిజానికి స్టూడెంట్ ఎథిక్స్ అండ్ వేల్యూస్ పదవికి గరికపాటి నరసింహారావే అర్హులు. ఎందుకంటే ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు కనుక. లెక్చరర్‌గా చాలా కాలం పని చేశారు. చాగంటికి బోధనలో అనుభవం లేదు. ఆయన చేసిన ఉద్యోగం వేరు. మరి గరికపాటికి ఇవ్వకుండా చాగంటికి ఎందుకిచ్చారన్న అనుమానం తప్పకుండా కలుగుతుంది. గరికపాటికి ఆ పదవి ఇవ్వకుండా అడ్డుకున్నది జనసేనాని పవన్ కల్యాణ్ అట! కొన్నాళ్ల కిందట అలయ్‌బలయ్ వేడుకలో చిరంజీవి-గరికపాటి నరసింహారావు మధ్య చిన్నపాటి గొడవ ఏర్పడింది. తన ప్రవచనం జరుగుతున్నప్పుడు చిరంజీవితో కొంత మంది సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం గరికపాటిని డిస్ట్రబ్ చేసింది. దాంతో ఆయన కోపగించుకున్నారు. సహజంగానే చిరంజీవి అభిమానులు గరికిపాటిపై విరుచుకుపడ్డారు! అప్పటి నుంచి పవన్ కల్యాణ్ కూడా గరికపాటిపై గుర్రుగా ఉంటున్నారని వినికిడి. అందుకే గరికిపాటికి నామినేటెడ్ పదవి దూరం అయినట్టుగా సమాచారం!