TTD news: నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం
డయల్ యువర్ ఈవో
By : Sreedhar Rao
Update: 2024-09-06 02:45 GMT
ఎన్నికల కోడ్ కారణంగా తిరుమలలో నెల రోజుల నుంచి ఆగిపోయిన
టీటీడీ నేడు డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహిస్తోంది. సెప్టెంబరు 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 2.50 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261 అని టీటీడీ తెలిపింది.
అంతేకాకుండా నేడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు సీల్డ్ టెండర్లను టీటీడీ నేడు ఆహ్వానిస్తోంది. టెండర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు సేకరించవచ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ కార్యాలయంలో సీల్డ్ టెండర్లు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు అందజేయాలి.