Tirumala Devotees Rush : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది.

By :  Eha Tv
Update: 2024-06-14 09:26 GMT

తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. కాంపార్టుమెంట్లు నిండిపోయాయి. స్వామి దర్శనం కోసం శిలాతోరణం వరకు క్యూలైన్‌లో నిల్చున్నారు భక్తులు. గురువారం 61,499 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 33,384 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు. టోకెన్లు లేని భక్తులకు 18 నుంచి 20 గంటలలో సర్వ దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక తిరుపతి అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోtirumala temple have huge Massive crowd with devotees జూన్ 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

Similar News