Raghuveera Reddy : మా విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారు.? సీఎం చంద్ర‌బాబుకు ర‌ఘువీరా ప్ర‌శ్న‌

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వ‌హించిన‌ నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తేలిపోయింది.

By :  Eha Tv
Update: 2024-06-23 05:28 GMT

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వ‌హించిన‌ నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు తేలిపోయింది. ఈసారి నీట్ పరీక్షలో భారీ సంఖ్యలో టాపర్లు రావడంతో దీనిపై అనుమానాలు మొదలయ్యాయి. చివరికి అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే అరెస్టైన అభ్యర్ధి అనూరాగ్ యాదవ్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను నీట్ పరీక్షకు ముందు రోజు రూ.30 లక్షల చొప్పున తీసుకుని నలుగురికి పేపర్ ను అమ్మేసినట్లు తెలిపాడు. సమాధానాలను కూడా వారికి అందించినట్లు తెలిపాడు. అలాగే తనకు లభించిన ప్రశ్నాపత్రం అసలు పరీక్ష పేపర్ తో సరిపోలినట్లు కూడా అనురాగ్ పేర్కొన్నాడు. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Full View

ఈ నేప‌థ్యంలోనే ఈ విష‌య‌మై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ర‌ఘువీరా రెడ్డి స్పందించారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌శ్న‌లు సంధించారు. ర‌ఘువీరా త‌న పేస్‌బుక్ పోస్టులో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మన విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఈ నష్టాన్ని నివారించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..? మా విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తార‌ని ప్ర‌శ్నలు సంధించారు.

Tags:    

Similar News