Nara Bhuvaneshwari : నేటి నుంచి నాలుగు రోజులు నారా భువనేశ్వరి కుప్పం పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులలో పాల్గొనడంతో పాటు కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవనున్నారు. భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్నారు. ఆమె పర్యటనలో బాగంగా నియోజకవర్గంలోరి మహిళలతో ముఖాముఖి సంభాషించనున్నారు. అక్కడ ఆమె వారి సమస్యలను వింటారు. అలాగే పలు గ్రామాలకు కూడా వెళ్లనున్నారు.
మహిళా సాధికారతకు మద్దతుగా భువనేశ్వరి నియోజకవర్గంలోని మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు. స్థానిక నివాసితులకు వృత్తి శిక్షణ అవకాశాలను పెంపొందించేందుకు.. కుప్పంలో కొత్త స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు కుప్పం ప్రాంత టీడీపీ నాయకులు సమన్వయం చేస్తున్నారు. తొలిరోజు గుడుపల్లె మండలం కమ్మగుట్టపల్లెలో మహిళలతో మధ్యాహ్నం ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అనంతరం కంచిబండార్లపల్లెలో గ్రామీణ మహిళలను కలిసి వారి సమస్యలు వింటారు.
PES గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు. అక్టోబర్ 24 ఉదయం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులు ఎన్.కొత్తపల్లె, నడిమూరు, ఉర్లబనపల్లె, గుడ్లనాయనిపల్లెతో పాటు సోమాపురం, కర్లగట్ట, రామకుప్పం మండల పరిధిలోని పలు గ్రామాలను సందర్శించనున్నారు. అక్కడ ఆమె స్థానిక మహిళలను కలుసుకుని వారి సమస్యలను వింటారు. జూలై 26న శివపురంలో గృహ నిర్మాణ పనులను పరిశీలించి.. ఉదయం 10:30 గంటలకు పీఈఎస్ ఆడిటోరియంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు ఆమె తిరుగు ప్రయాణంతో పర్యటన ముగుస్తుంది.