Minister Narayana : టీడీఆర్ బాండ్ల జారీలో భారీ స్కాం జ‌రిగింది

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కాం జరిగిందన్నారు పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ..

By :  Eha Tv
Update: 2024-07-25 01:28 GMT

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా టీడీఆర్ బాండ్ల జారీలో పెద్ద స్కాం జరిగిందన్నారు పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ..బాండ్ల లో అక్రమాలు చూస్తే.ఇలాంటి స్కాం లు కూడా చేస్తారా అనిపించిందని అన్నారు...రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలని అన్నారు.అమరావతి సచివాలయంలో పట్టణ ప్రణాళికా విభాగంలోని అధికారులతో మంత్రి సమీక్ష చేశారు..ఈ సమీక్షకు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు..టౌన్ ప్లానింగ్ లో రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఉన్న అధికారులు,ఉద్యోగులు గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు..భవన నిర్మాణాలకు అనుమతులను పూర్తిగా ఆన్ లైన్ లోనే ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.ఎన్ని అంతస్తుల భవనం అయినా ఆన్ లైన్ లో అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు మంత్రి.ఆ తర్వాత మంత్రి నారాయణ. మీడియా తో మాట్లాడారు.

టౌన్ ప్లానింగ్ విభాగంలో 2014-2019 మధ్య తాను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు మంత్రి.కానీ గత ఐదేళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.విశాఖపట్నం,తణుకు,గుంటూరు,తిరుపతి లో టీడిఆర్ బాండ్ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని మంత్రి చెప్పారు..తణుకులో జరిగిన అక్రమాలపై వేసిన అధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక అందినదన్న మంత్రి.....నివేదికపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామని చెప్పారు.తణుకు లో 29 బాండ్లు జారీ చేస్తే అన్నీ అక్రమమే అని తేలిందన్నారు..బాండ్ల జారీలో ఎకరాల ప్రకారం విలువ కట్టాల్సి ఉన్నప్పటికీ చదరపు గజాల ప్రకారం భూమి విలువ కట్టి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు..ఒక చదరపు గజానికి రు.4500 ఉండగా...22,000 రూపాయల గా లెక్క కట్టినట్లు చెప్పారు.అంటే 1:200 ఇవ్వడానికి బదులు 1:400 గా ఇచ్చారని అన్నారు.స్థలం కోల్పోతున్న సమీపంలో ధర కంటే ఎక్కడో 1.4 కిమీ దూరంలో ఉన్న భూమి విలువను పరిగణనలోకి తీసుకుని బాండ్లను జారీ చేయడం అనేది ఒక పెద్ద స్కాం అని అన్నారు.తణుకులో బాండ్ల జారీలో అక్రమాలకు పాల్పడ్డ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు.ఎక్కడైతే బాండ్ల జారీలో అక్రమాలు జరిగాయో అలాంటి చోట్ల ఇచ్చిన బాండ్లను నిలిపివేసినట్లు చెప్పారు మంత్రి.కోర్టుకు వెళ్లిన 300 మంది బాండ్లను మార్చుకున్నారని...గత ప్రభుత్వంలో పాలన సున్నా అనేది బాండ్ల జారీ ద్వారా నిరూపితమైంది అని అన్నారు.అధికారులు నిబంధనల ప్రకారం పనిచేయాలని అన్నారు.

ఇక తిరుపతిలో కూడా రెండు టీడీఆర్ బాండ్ల లో చదరపు గజం విలువ 40,000 గా అధిక ధర చూపించడం...గుంటూరులో కూడా చదరపు గజం విలువ 9000 ఉండాల్సింది 20000 గా చూపించి బాండ్లు జారీ చేసినట్లు మంత్రి చెప్పారు.విశాఖపట్నం లో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా నోటరీ అప్రూవల్ తో బాండ్లు జారీ చేసి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.మొత్తంగా వందల కోట్ల అక్రమాలు జరిగాయని స్పష్టం చేశారు.రాజకీయ నాయకులు చెప్పినా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో బదిలీ చేస్తారనే భయంతో అధికారులు పనిచేసినట్లు మంత్రి చెప్పారు.టీడీఆర్ బాండ్ల జారీ అక్రమాల్లో నాయకులదే మొదటి తప్పు అన్నారు.టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలపై సీఎం తో చర్చించి అవసరమైతే మరికొన్ని కమిటీలు వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎన్ని అంతస్తుల భవనం నిర్మాణం అయినా అనుమతులను ఆన్ లైన్ లోనే ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. 15 రోజుల్లోగా దరఖాస్తు పరిశీలించి ఎక్కడైనా సమస్య ఉంటే మరోసారి అర్జీడారునికి సమాచారం ఇవ్వాలన్నారు.ప్రభుత్వానికి చెడ్డ పేరు అయినా మంచి పేరు అయినా తీసుకురావడం లో టౌన్ ప్లానింగ్ కీలకమైందన్నారు.అందుకే ఈ విషయంలో ముఖ్యమంత్రి తనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు.

Tags:    

Similar News