YS Jagan : మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో ఆయనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు.
రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు మేరకు అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, అదనపు ఎస్పీ ఆర్.విజయ పాల్, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
వైసీపీ హయాంలో తనపై హత్యాయత్నం, కస్టడీలో చిత్రహింసలు, నేరపూరిత కుట్ర జరిగాయని గత నెలలో గుంటూరు పోలీసు సూపరింటెండెంట్‌కు రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, విజయ్‌పాల్‌లను నిందితులుగా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో నర్సాపురం నుంచి వైసీపీ టిక్కెట్‌పై ఆయన లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ రెబల్‌గా మారారు.
రాజద్రోహం కేసులో 2021 మే 14న హైదరాబాద్‌లోని అఆయన నివాసం నుండి రఘురామకృష్ణం రాజును అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు.. రాష్ట్రంలో మత అశాంతిని ప్రేరేపించినందుకు ఆయనపై కేసు నమోదైంది.