AP Govt : రైతులకు ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌

అధిక వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతుల(Farmers)కు ప్ర‌భుత్వం ఉప‌శ‌మ‌నం క‌లిగించే గుడ్‌న్యూస్ చెప్పింది.

Update: 2024-08-05 03:23 GMT

అధిక వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతుల(Farmers)కు ప్ర‌భుత్వం ఉప‌శ‌మ‌నం క‌లిగించే గుడ్‌న్యూస్ చెప్పింది. పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu) అన్నారు. రైతు మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టే రైతుల కష్టాలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్-జూలై(June-July) నెలలో సాధారణానికి మించి 48.6% అధిక వర్షపాతం నమోదు కావడం వలన ఇప్పటికే వరి ఊడ్పుల కోసం సిద్ధంగా వున్న సుమారు 1406 హెక్టర్ల నారుమళ్లు, ౩౩వేల హెక్టర్లలో నాట్లు పూర్తైన వరి పంట ముంపునకు గురైందని అన్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు మంత్రుల బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించామని, మంత్రుల బృందం, రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ జిల్లాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు నిర్వహించి ముందస్తుగానే రైతుల అవసరాలకు తగినట్టుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారు చేస్తున్నామన్నారు.. ముంపునకు గురై పంటలు దెబ్బతిన్న రైతులకు సత్వర సహాయంగా, వెనువెంటనే విత్తుకొనుటకు 80% రాయితీపై వరి పంట విత్తనాలను పంపిణి చేయటకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా సుమారు 6,356 క్వింటాళ్ల వరి విత్తనాలను సంబంధిత జిల్లాలైన తూర్పు గోదావరి(East Godavari), పశ్చిమగోదావరి(West Godavari), ఏలూరు(Eluru), కాకినాడ(Kakinada), అనకాపల్లి(Anakapalli) జిల్లాలో గల ప్రతి రైతు సేవా కేంద్రాల వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణి చేయటానికి సిద్ధం చేశామన్నారు. అధిక వర్షాల వలన నారుమళ్లు, నాటిన వరి పంటలు దెబ్బ తిన్న రైతులు 80% రాయితీపై తమతమ గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ పొంది మంచి సాగు యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. 

Tags:    

Similar News