Chittoor Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రెండు లారీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రెండు లారీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా కేంద్రంలోని మొగిలిఘాట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో లారీ కూడా ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు.. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
చిత్తూరు జిల్లా మొగలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి అరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.