రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపిస్తుంది.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో టీడీపీ(TDP) ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌(YS jagan) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు నల్లకండువాలు కప్పుకుని అసెంబ్లీ(Assembly) ఆవరణలో నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ‘సేవ్‌ డెమోక్రసీ’(Save democracy) నినాదాలు చేస్తూ అసెంబ్లీ హాలులోకి వెళ్లేందుకు ముందుకు క‌దిలారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేల‌ను ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్దంటూ గేటు వ‌ద్దే అడ్డుకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేల వ‌ద్ద ఉన్న‌ ప్లకార్డులు లాక్కొని చించేశారు. దీంతో మాజీ సీఎం జ‌గ‌న్ పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోస్ట‌ర్లు గుంజుకుని చించేసే హ‌క్కు ఎవ‌రిచ్చార‌ని మండిప‌డ్డారు. అధికారం ఎవ్వ‌రికి శాశ్వ‌తం కాదన్నారు. మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామ‌ని గుర్తుంచుకోవాల‌న్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతుంద‌ని.. పోలీసుల వైఖ‌రి అత్యంత దారుణంగా ఉంద‌న్నారు. దీంతో గేటు వ‌ద్ద కాసేపు ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఆ త‌ర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు(YCP MLA) నల్లకండువాలతో అసెంబ్లీలోకి వెళ్లారు.


Updated On 22 July 2024 6:08 AM GMT
Eha Tv

Eha Tv

Next Story