కొడుకు జగన్మోహన్‌రెడ్డి వైపు నిలబడలా? లేక కూతురు వై.ఎస్‌.షర్మిలకు మద్దతు ఇవ్వాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారామె!

వై.ఎస్‌.విజయమ్మపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలను చూస్తున్నవారికెరికైనా ఈ విషయం అర్థమవుతుంది. కొడుకు జగన్మోహన్‌రెడ్డి వైపు నిలబడలా? లేక కూతురు వై.ఎస్‌.షర్మిలకు మద్దతు ఇవ్వాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారామె! గడచిన ఎన్నికల నుంచే కొడుకోవైపు, కూతురోవైపు ఉన్నారు. తల్లి విజయమ్మకు ఎవరివైపు ఉండాలో అర్థం కావడం లేదు. ఇద్దరు రెండు కళ్లలాంటి వారు కాబట్టే ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో జగన్‌కు తల్లి వై.ఎస్‌.విజయమ్మ, చెల్లి షర్మిల బాసటగా నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం విజయమ్మ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఎన్నికల ముందు రోజు వరకు ఆమె ఎవరి పక్షమూ వహించకుండా తటస్థంగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది గంటల ముందు కడప లోక్‌సభకు పోటీ చేస్తున్న వై.ఎస్‌.షర్మిలను ఆశీర్వదించండి అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో కడప జిల్లాకు సంబంధించినంత వరకు జగన్‌కు తీవ్ర నష్టం కలిగించింది. తల్లి జగన్‌వైపు లేదనే అభిప్రాయానికి రాష్ట్ర ప్రజలు వచ్చారు. ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన విజయమ్మ హుటాహుటిన తాడెపల్లికి వెళ్లి కొడుకును కలిశారు. అక్కడ కొద్ది రోజుల పాటు ఉన్నారు. తాజాగా ఆస్తులకు సంబంధించి అన్నా చెల్లెలు గొడవపడుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. లేఖలు రాసుకుంటున్నారు.

Updated On 29 Oct 2024 10:48 AM GMT
ehatv

ehatv

Next Story