ఆంధ్రప్రదేశ్‌ క్యేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ క్యేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది ఏంటంటే వైఎస్‌ఆర్‌ జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌ మరణించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కడప జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఎవరూ దీనిని వ్యతిరేకించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్ణయం. అయితే నిన్న కేబినెట్‌లో ఆ జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. దీనికి ఎవరూ ఆబ్జెక్షన్‌ చేయకపోవచ్చు. మరికొందరు ఏమో గతంలో మీరు ఐదేళ్లు పరిపాలించినప్ప్పుడు ఎందుకు మార్చలేదని ప్రశ్నించవచ్చు. అయితే కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని పెద్దగా తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ షర్మిల కొన్ని పాయింట్స్‌ యాడ్ చేస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏంటా పాయింట్స్‌.. ఈ అంశానికి సంబంధించి సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ.



ehatv

ehatv

Next Story