ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడ ఉన్నారు. 50 రోజులుగా షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కార్యకలాపాలపై సోషల్ మీడియాలోనే అప్పడప్పడు యాక్టివ్‌గా స్పందిస్తున్నారు. గడిచిన ఎన్నికల కంటే ముందు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రోజు, ప్రతినిత్యం చాల యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆ సమయంలో వైసీపీపై తీవ్రమైన వ్యాఖ్యలు, తీవ్ర విమర్శలు చేసేవారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరారు. అరకొరగా టీడీపీపై విమర్శలు కూడా చేశారు. ఎన్నికలు అయిపోయాయి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ దేశంలో ఎన్డీఏకు ప్రధాన ప్రత్యర్థిగా ఇండి కూటమి ఉన్నా కానీ అందులో ముఖ్యపాత్ర కాంగ్రెస్‌దే. ఈ దేశంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాడుతోంది కాంగ్రెస్సే. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఫైట్ కనిపిస్తుందా అంటే అది కనపపడం లేదు. అడపాదడపా కనిపస్తున్నారు, సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారే తప్ప సీరియస్‌గా ఆమె కార్యకలాపాలు చేయడం లేదు ఎందుకో.. ఆంధ్రప్రదేశ్‌లో ఆమె ఇల్లు కొనుక్కున్నారని కూడా తెలిసింది. కానీ ఎన్డీఏపై అంత సీరియస్ ఫైట్ ఎందుకు కనిపించడం లేదు..! ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
