YS Sharmila : జగన్‌ను తిడితేనే రాస్తారా.. టీడీపీ మీడియాపై షర్మిల అసహనం..!!
వైఎస్ షర్మిలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతోంది ఏంటి.. మీరు రాస్తోంది ఏంటి అని ఆమె జర్నలిస్టులను ప్రశ్నించారు.

వైఎస్ షర్మిలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతోంది ఏంటి.. మీరు రాస్తోంది ఏంటి అని ఆమె జర్నలిస్టులను ప్రశ్నించారు. ఈ మేరకు జర్నలిస్టులతో డీల్ కుదుర్చుకుంటున్నారు. నేను మాట్లాడింది మాత్రమే, నేను చెప్పింది మాత్రమే ప్రచురిస్తేనే మీ ప్రశ్నలకు జవాబు ఇస్తామని జర్నలిస్టులతో షర్మిల అంటున్నారు. అయితే షర్మిలారెడ్డికి ఇప్పటికి అర్థం అవుతున్నట్లుంది. ఇప్పటికి తత్వం బోధపడినట్లు ఉంది. నిజానికి తన మాటలు వ్యక్తిగతంగా తనకు నష్టం చేకూర్చాయి. దీంతో జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్‌ను చేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది. డ్యామేజ్ కంట్రోల్ ఏంటి.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..పార్టీకి.. ఆమెకు కూడా.. షర్మిలారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్న తర్వాత వైఎస్ జగన్‌పై ఆమె చేసిన విమర్శలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళ్లాయి. కాంగ్రెస్ విధానాలు, కాంగ్రెస్ ఎజెండా ప్రజల్లోకి వెళ్లలేదు. ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూటమిపై కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది. కాంగ్రెస్ వాయిస్‌ను ప్రతీ అంశంలో, ప్రతీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కానీ కూటమికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడిన మాటలు ఎవరికీ గుర్తులేవు. కానీ జగన్‌పై ఆమె చేసిన విమర్శలను మాత్రమే తెలుగుదేశానికి సంబంధించిన మీడియా రాస్తూ వస్తోంది. 15 నిమిషాలు ప్రభుత్వ విధానాల గురించి, కేంద్రం గురించి మాట్లాడి చివరి 2 నిమిషాల్లో జగన్‌పై విమర్శలు చేయడంతో ఆ రెండు నిమిషాల్లో ఆమె మాట్లాడిన మాటలే పత్రికల్లో, మీడియాలో వస్తున్నాయి. అయితే నిన్న వక్ఫ్ బిల్లు సందర్భంగా షర్మిల మాట్లాడిన సందర్భంలో ఆమె జర్నలిస్టులతో మాట్లాడిన మాటలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
