YS Jagan Straight Questions : ప్రభుత్వానికి జగన్ సూటి ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘంగా మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిస్థితులు, ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. అసెంబ్లీకి వెళ్లి ఎందుకు ఈ ప్రశ్నలు అడిగిన దానికి జగన్ సమాధానం ఇస్తూ అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు మీతో మాట్లాడినట్లు కూడా నేను మాట్లాడలేను. కేంద్రం ఇచ్చిన గణాంకాలతో సహా మీడియా ముందు ఉంచానని ఆయన అన్నారు. అసెంబ్లీలో నాకు ఈ అవకాశం ఇవ్వరు కదా.. అందుకే మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని జగన్ అన్నారు. అసెంబ్లీలో మాకు ఈ ప్రశ్నలు అడిగే అవకాశమే ఉండదు. సభలో అవకాశం ఉండదు కాబట్టి బయట చేస్తున్నానని జగన్ అన్నారు. ప్రభుత్వంపై ఆన్ రికార్డ్ కొన్ని విమర్శలు చేశారు. వీటికి ప్రభుత్వం కచ్చితంగా జవాబు చెప్పాలి. ఈ 9 నెలల్లో 80 వేల కోట్ల అప్పులు చేసిందనేది జగన్ చెప్తున్నమాట. అమరావతి పేరుతో మరో 52 వేల కోట్లు, ఇతరత్రా మరిన్ని అప్పులు కలిపి 1.45 లక్షల కోట్లు అప్పులు చేసిందని జగన్ విమర్శించారు. ఈ ప్రశ్నకు ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జగన్ సుదీర్ఘ ప్రెస్‌మీట్‌పై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ
