పవన్ కల్యాన్ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

పవన్ కల్యాన్ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడక ముందు పవన్‌ను ప్యాకేజ్ స్టార్ అంటూ.. టీడీపీ ఇచ్చే ప్యాకేజ్ కోసం పనిచేస్తారని ఆరోపణలు చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో కూడా పవన్‌ను ప్యాకేజీ స్టార్, పావలా స్టార్ అంటూ ట్రోల్ చేశారు. తన పార్టీ అభివృద్ధి కంటే టీడీపీ కోసమే పనిచేస్తారని పవన్‌పై వైసీపీ విమర్శలు చేసింది ఎందుకంటే వేరే విమర్శ చేయడానికి వైసీపీకి ఆధారాలు లేవు. పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రభుత్వంలో లేరు. గతంలో సొంత డబ్బులతో సేవ కార్యక్రమాలు చేశారు, సొంత డబ్బులతో పార్టీని నడిపించారు, తన సొంత డబ్బులనే రైతులకు ఇచ్చారు. తన సంపాదనతోనే ఖర్చు చేస్తున్నారనేది వాస్తవమే. ప్రజలు కూడా అది నమ్మారు. తన సొంత సంపాదనే ఖర్చు చేస్తున్నారు కదా అని ప్రజలు విశ్వసించారు. అప్పుడు వైసీపీకి పవన్ అవినీతి పరుడు అనడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో లేడు. కానీ తొలిసారిగా పవన్ అవినీతిపరుడని జగన్ విమర్శించారు. పవన్ కల్యాణ్‌పై జగన్ అవినీతి ఆరోపణ చేయడం ఇదే తొలిసారి. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పవన్‌కు భాగస్వామ్యం ఉందని జగన్ అన్నారు. మద్యం షాపుల్లో ఎమ్మెల్యేలు కమీషన్లు దండుకుంటున్నారనేది టీడీపీ మీడియాలో వచ్చిన వాస్తవం. ఈ అవినీతిలో పవన్‌కు కూడా వాటా ఉందనేది జగన్ ఆరోపణ. దీనిపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ
