ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో నాయకుల రహస్య పర్యటనల వ్యవహారం రకరకాల చర్చలకు దారి తీస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో నాయకుల రహస్య పర్యటనల వ్యవహారం రకరకాల చర్చలకు దారి తీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP)అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ (TDP)అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu),పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh)విదేశీ పర్యటనకు వెళ్లారు. వారు ఎక్కడికి వెళ్లారు? అనే విషయంపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా రచ్చ చేసింది. ఎక్కడికి వెళ్లారు? పర్యటనను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? అక్కడ వారు ఏం చేశారు? ఎవరిని కలిశారు? ఏ కారణాలతో అక్కడికి వెళ్లారు? అక్కడి నుంచి ఏపీలో ఏ రకమైన కార్యక్రమాలను నిర్వహించారు? బహిరంగపరచాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తూ వచ్చింది. వైసీపీ డిమాండ్‌ చేసినప్పటికీ, ఆ పార్టీ సోషల్‌ మీడియాలో దీని గురించి రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ తెలుగుదేశంపార్టీ మాత్రం ఈ అంశంపైన ఎక్కడా స్పందించలేదు. చంద్రబాబు నాయుడు రెండు వారాలకు పైగా విదేశీ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి ఇండియా(India)కు వచ్చారు. నారా లోకేశ్‌ పర్యటనకు సంబంధించి కూడా ఆయన ఎక్కడికి వెళ్లారు? ఏమిటనే దానిపైన వివరాలు బయటకు రాలేదు. ఆ మాటకొస్తే ఈ రోజు వరకు అంటే ఆగస్టు 17వ తేదీ వరకు చంద్రబాబు, లోకేశ్‌లు ఎక్కడికి వెళ్లారనేదానిపైన టీడీపీ కానీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కానీ ఏ దశలోనూ బయటపెట్టలేదు. గతంలో చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా కుటుంబంతో విహార యాత్రకు వెళ్లినా ఎక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? ఏమేమీ సందర్శించారు? అనే విషయాలకు సంబంధించి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం మీడియా బ్రీఫింగ్‌ ఉండేది. మీడియాకు సమాచారంతో పాటు ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్‌ చేసేవారు. సొంత సోషల్‌ మీడియాలో కూడా వారి పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచేవారు. కానీ మొట్టమొదటిసారి చంద్రబాబునాయుడు, లోకేశ్‌లకు సంబంధించిన విదేశీ పర్యటనలను అత్యంత రహస్యంగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయి, టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) పదే పదే బెంగళూరుకు వెళుతున్నారు. ఈ రెండు నెలల కాలంలో జగన్‌ బెంగళూరు(Bengaluru)కు ఆరుసార్లు వెళ్లి వచ్చారు. ఆయన రాజకీయాలలో రాక ముందు బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేసేవారు. హైదరాబాద్‌(Hyderabad) కేంద్రంగా కూడా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు జగన్‌. బెంగళూరు పర్యటనలో ఏం జరుగుతున్నదో చెప్పాలంటూ టీడీపీ డిమాండ్‌ చేస్తున్నది. జగన్ బెంగళూరు పర్యటనకు సంబంధించి టీడీపీ సోషల్ మీడియాల రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్‌ చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తిని కలిగిస్తున్నది. లోకేశ్‌ చెబుతున్నదాని ప్రకారం జగన్‌ కోల్‌కతా వెళ్లారట! అక్కడ హోటల్లో రెండు రోజుల పాటు గడిపారట! జగన్‌ ఎందుకు కోల్‌కతా(Kolkata)వెళ్లారు? రెండు రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం!


Updated On 17 Aug 2024 2:30 PM GMT
ehatv

ehatv

Next Story