ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడానికి కారణం పార్టీలు కూటమిగా ఏర్పడడం ఒక ఎత్తు అయితే..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడానికి కారణం పార్టీలు కూటమిగా ఏర్పడడం ఒక ఎత్తు అయితే.. కూటమి విజయానికి మరో ప్రధాన కారణం కమ్మ సామాజికవర్గం. టీడీపీకి బ్యాక్ బోన్‌లాగా కమ్మ సామాజికవర్గం ఉంది. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. అన్ని విధాలా ప్రయత్నించి కూటమి అధికారంలోకి రావడానికి కృషిచేశారు. ఆర్థికంగా ఎదిగేందుకు కూడా కృషిచేశారు. దేశవిదేశాల్లో ఉన్నవారు కూటమి విజయం కోసం ఇక్కడి వచ్చిన పనిచేశారు. నెలల తరబడి ఉద్యోగాలకు సెలవులు పెట్టి తమ స్వస్థలాలకు కూటమి కోసం పనిచేశారు. కూటమి విజయాన్ని తమ విజయంగా భావించారు. కూటమి గెలవకపోతే తమకు ఎగ్జిస్టెన్సీ ఉండదని భావించి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కృషి చేశారు. అయితే ప్రస్తుతం వారు కాస్త అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని రెండు నెలల క్రితమే వీడియోలు చేశాం. గుంటూరు జిల్లాలో టీడీపీ బాధ్యతలు మోస్తూ పార్టీ కోసం నిలబడ్డ నాయకులు, వైసీపీ హయాంలో టీడీపీ కోసం పాటుపడి నేతల్లో యరపతినేని శ్రీనివాస్, ఆలపాటి రాజా, పత్తిపాటి పుల్లారావు, ఇంకా ఎందరో నేతలు ఉన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక వాళ్లెవరూ ఇది మా ప్రభుత్వం అని ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. కనీసం ఎస్సైల నియామకం కూడా చేసుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్నారట. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు ఇప్పుడు పార్టీలో చేరి వారే పెత్తనం చెలాయిస్తున్నారని.. గతంలో జిల్లా ఎస్పీ ఎవరు ఉండాలనేది నిర్ణయించేవారిమని.. కానీ ఇప్పుడు అంతా సెంట్రలైజ్ అయిపోయిందని వాపోతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!
