ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది భారత ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చింది భారత ప్రభుత్వం. ప్రధాని కాకముందు హామీ ఇచ్చారు. గతంలో ప్రధానిగా మన్మోహన్ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదుకాదు 10 ఏళ్లు కావాలని బీజేపీ అడిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ప్యాకేజీకి అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ రాజకీయపార్టీలకు పెద్ద జోక్‌గా మారింది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రత్యేక హోదాపై మాటమార్చాయి. కమ్యూనిస్టు నేతలు, ఆంధ్ర మేధావుల ఫోరం నేతలు కొందరు ఇప్పటికీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖకు ప్రధాని వస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీ కరణ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఎవరికి ఇవ్వాలనేదానిపై ఒప్పందాలు జరిగాయన్న వార్తలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రులకు ఒక ఎమోషన్. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయనియ్యమని కూటమి నేతలు చెప్తున్నారు. ప్రధాని మోడీ అక్కడికి వస్తున్నారు కాబట్టి విశాఖను ప్రైవేటీకరణ చేయొద్దని, దానికి క్యాపిటివ్ మైన్స్ కేటాయించాలని రాజకీయపార్టీలు అడగాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై 'జర్నలిస్టు YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!