ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపార్టీలన్నీ భారతీయ జనతాపార్టీకి సంబంధించిన మిత్రపక్షాలే.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపార్టీలన్నీ భారతీయ జనతాపార్టీకి సంబంధించిన మిత్రపక్షాలే. పదే పదే ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ పార్టీలు ఇదే మాట చెప్తూ వస్తున్నాయి. గడిచిన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విమర్శలు చేసింది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. చంద్రబాబునాయుడు, జగన్మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్.. వీరు ముగ్గురు కూడా బీజేపీకి మిత్రపక్షాలే లాంటి విమర్శ బీజేపీ వ్యతిరేక రాజకీయపార్టీలు వాదిస్తూ వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి బీజేపీతో కలిసి పరోక్షంగా ఉన్నరన్న విషయం దేశరాజకీయాలు గమనిస్తున్నవారికి అర్థం అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కేంద్రంలో కూడా టీడీపీ భాగస్వామిగా చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నా కానీ వైసీపీ కేవలం టీడీపీనే ఎందుకు టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీపై ఎందుకు మాట్లాడడం లేదు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
