ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) రాజకీయ అరెస్ట్‌లు ఉండవచ్చనే భావన కలుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) రాజకీయ అరెస్ట్‌లు ఉండవచ్చనే భావన కలుగుతోంది. ఆ తరహా వాతావరణ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులను చూసినప్పుడు గడచిన ప్రభుత్వ హాయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) ప్రభుత్వంలో తెలుగుదేశంపార్టీకి సబంధించిన నాయకులు పలు రకాల కేసులలో అరెస్టయ్యారు. దేవినేని ఉమా , కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడులతో పాటు మరికొంత మంది తెలుగుదేశంపార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు వివిధ కేసులలో అరెస్టయ్యారు. కొంతమంది జైలు జీవితం కూడా గడిపారు. ఆ మాటకొస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) కూడా అరెస్టయ్యారు. జైలులు కొంతకాలం ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశంపార్టీ(TDP) కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన నాయకుల అరెస్టులు ఉండబోతున్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP) పార్టీకి సంబంధించిన నాయకులను కూడా జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులలో ఓ రకమైన భయం ఆవరించింది. అరెస్ట్‌ అవుతామేమోనన్న భయం నేతలలో కనిపిస్తోంది. అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలన్నదానిపై నిపుణులతో చర్చిస్తున్నారు. తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్‌(Pattabhi Ram) అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంబంధించిన కార్యకర్తలు రెండేళ్ల కిందట టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఆ దాడి ఘటనలకు సంబంధించి గుంటూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోర్టులో విచారణ కూడా జరగబోతున్నది. ఇప్పటికే ఈ ఘటనతో ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారని వినికిడి. వీళ్లు మాత్రమే కాదు రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో కూడా వైసీసీ నాయకుల అరెస్ట్‌కు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించి బెయిల్‌ తీసుకునే ప్రయత్నం పార్టీకి చెందిన ముఖ్య నేతలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయంతో ఇతర నాయకులు కూడా ఆ దిశగా వెళుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story