మేఘాకే పోలవరం..!
పోలవరం ప్రాజెక్టు(Polavaram Project). ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడుతున్న సందర్భంలో , ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో పోలవరం ప్రస్తావన తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. పోలవరం ప్రస్తావన లేకుండా ఎవరూ మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసే సమయంలో కావచ్చు పోలవరం ప్రస్తావన కచ్చితంగా ఉండి తీరుతుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు ఉంది. పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. తాగునీటి సమస్య తీరిపోతుంది. గోదావరి(Godhavari) నుంచి ప్రతి ఏటా వందలాది టీఎంసీల నీరు సముద్రం పాలవ్వకుండా కాపాడుకునే అవకాశం పోలవరం ప్రాజెక్టు ద్వారా కలుగుతుంది. ఇటువంటి పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పార్టీలు ఆలస్యం చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును ఓ జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం కోసమే పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే కట్టబెట్టారని విపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YCP) ఆరోపిస్తూ వచ్చింది. జగన్(YS jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో మళ్లీ టెంటర్లను పిలిచింది. రివర్స్ టెండరింగ్ పేరుతో టెండర్లను మళ్లీ పిలవడం వల్ల రెండు ప్రధానమైన నిర్మాణ సంస్థలకు పక్కకు వెళ్లిపోయాయి. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు(Megha engineering organisation) పోలవరం కాంట్రాక్టు పనులు దక్కాయి. మేఘా సంస్థకు వైసీపీ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను కట్టబెడుతున్నదని తెలుగుదేశంపార్టీ(TDP) చెప్పింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేఘా సంస్థను పక్కన పెడతారని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మేఘా సంస్థకే పనులు అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం.