Waqf Bill : వక్ఫ్‌ బిల్లుకు వైసీపీ మద్దతు..!

రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అనుకూలంగా ఓటేసిందని ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp)కి సంబంధించిన ఏడుగురు ఎంపీలు వక్ఫ్‌ బిల్లుకు మద్దతుగా ఓటు వేసినట్లు చెప్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలం, బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు ప్రచారం చేశారు. అయితే వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. రాజ్యసభలో వక్ఫ్‌ బిల్లు(Waqf Bill) ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీకి చెందిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(Yv Subba Reddy) ఐదు నిమిషాలు మాట్లాడారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని, ఈ బిల్లులో పలు సవరణలు చేయాలని సూచించారు. అయితే తాము వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశామని, కావాలనే మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి జనసేన(Jsp), టీడీపీ(Tdp), బీజేపీ(Bjp) ఎంపీలు ఓటు వేశారు కానీ.. తాము బిల్లుకు అనుకూలంగా ఓటు వేశామని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ చెప్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story