YCP Leaders Booked Theaters:పుష్ప 2 కోసం థియేటర్లు బుక్ చేసిన వైసీపీ నేతలు
అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. పుష్ప 2 సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తూ వస్తున్నది.
అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. పుష్ప 2 సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఓ వర్గం ప్రచారం చేస్తూ వస్తున్నది. పుష్ప 2 విడుదల సమయానికి నెగటివ్ ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. చాలా పద్దతిగా, వ్యూహాత్మకంగా కొందరు నెగటివ్ ప్రచారం చేస్తూ వస్తున్నారు. పుష్ప 2 టీజర్‌పైనా, పుష్ప 2 పాటలపైనా, పుష్ప 2 ఈవెంట్లపైనా ఓ పథకం ప్రకారం నెగటివ్ క్యాంపెన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోని కొన్ని హ్యాండిల్స్ పనిగట్టుకుని ఈ విధమైన ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ కొత్త కొత్త పేర్లతో నిన్నమొన్న పుట్టిన హ్యాండిల్స్ కావడం విశేషం. సెకండ్ పార్ట్ సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయిని చెబుతున్నాయి. ఆర్య 2 ఫెయిలయ్యిందని, పుష్ప 2 కూడా పరాజయం పాలవుతుందని రాస్తున్నాయి. ఏ రకమైన నెగటివ్ క్యాంపెన్ చేయాలో ఆ రకంగా చేస్తున్నాయి. ఈ నెగటివ్ ప్రచారం ఎవరు చేస్తున్నారన్న విషయంపై అందరికీ ఓ క్లారిటీ ఉంది. అందుకే సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఇంతకు ముందు అల్లు అర్జున్ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేసేవారు. ఈసారి వాటికి కూడా దూరంగా ఉన్నారు. అల్లు అరవింద్ కూడా అలాగే మాట్లాడారు. మొత్తంగా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ పుష్ప 2కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి విషెస్ చెప్పి రావడంతో బన్నీ తమవాడు కాదన్నట్టుగా ప్రవర్తించసాగారు కొంతమంది. సినిమాల నుంచి అల్లు అర్జున్ వెళ్లిపోవాలన్నంతగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. దీనికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కౌంటర్ చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే పుష్ప 2 కోసం కొన్ని జిల్లాలలో కొన్ని థియేటర్లను బుక్ చేసుకున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అల్లు అర్జున్‌ను తమవాడుగా చేసుకున్నారు. పుష్ప 2 కోసం పాజిటివ్ ప్రచారం మొదలు పెట్టారు.