వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై కిరణ్ అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డిపై కిరణ్ అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కిరణ్ చేసిన వ్యాఖ్యలపై
పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరు. ఎవరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం కూడా చాలా స్పీడ్‌గా రియాక్టైంది. అతడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిని అరెస్ట్ కూడా చేయించింది. దీంతో కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారు చాలా మంది. మహిళలు ఎవరైనా కూడా, ఏ రంగానికి చెందిన వారైనా కూడా, ఏ పార్టీకి చెందిన మహిళలైనా కూడా, ఏ పార్టీకి చెందిన రాజకీయనాయకుల కుటుంబసభ్యులపైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న సమాచారం ఇచ్చారు. అయితే కిరణ్ చేసిన వ్యాఖ్యలు, అరెస్టుల మధ్యన వైసీపీకి చెందిన సోషల్ మీడియా నారా బ్రాహ్మణిపై చాలా అసభ్యకరమైన పోస్టులు పెడుతోంది. అది వైసీపీ అఫీసియల్ సోషల్ మీడియానా మరోటా తెలియదు కానీ.. కిరణ్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆమెపై ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నారా బ్రాహ్మణి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా ఆమెపై పోస్టులు పెడితే మేం ఖండించాం. ఇలాంటి పోస్టులకు వ్యతిరేకంగా మేం మాట్లాడాం. అయితే ఇలా పోస్టులు పెడుతున్నవారిపై వైసీపీ అధిష్టానం అదుపులో పెట్టాలి. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
