స్వరూపానందేంద్ర సరస్వతి(Swaroopanandendra Saraswati).. ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధం.

స్వరూపానందేంద్ర సరస్వతి(Swaroopanandendra Saraswati).. ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధం. స్వరూపానందస్వామిగా అందరూ పిలుచుకునే ఈ వ్యక్తి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలో(AP politics) కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వానికి ఆయన ఓ రాజగురువుగా వ్యవహరించారన్న విమర్శ కూడా ఉంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YSRCP) నాయకులు కావొచ్చు, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) కావొచ్చు, ఆ సమయంలో స్వరూపానందేంద్ర సరస్వతికి ఇచ్చిన ప్రాధాన్యత చూసిన వారికెవరికైనా అది నిజమేనేమో అని అనిపించింది. చాలా మంది మంత్రులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకోవడం, ఆశ్రమానికి వెళ్లడం జరుగుతూ ఉండేది. ఆ మాటకొస్తే కేవలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఆయన దగ్గరకు వెళ్లి ఆశీర్వాదాలు, సలహాలు సూచనలు తీసుకునేవారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామి తరచుగా జగన్‌ను ప్రశంసిస్తూ వచ్చారు. జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితులనే పేరును తెచ్చుకున్నారు స్వరూపానంద స్వామి. గతంలో జగన్‌తో కొన్ని పూజలు కూడా చేయించారాయన. జగన్మోహన్‌రెడ్డి కార్యక్రమాలకు ఆయన ముహూర్తాలు పెడుతూ వచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్వామిపై రకరకాల విమర్శలు చేస్తూ వచ్చింది. అలాంటి విమర్శలలో ప్రధానమైనది తిరుమలలో స్వరూపానందస్వామికి చెందిన కాటేజ్‌పై విమర్శ. అలాగే విశాఖలో ఆయనకు భూముల కేటాయింపుపై కూడా టీడీపీ(TDP) అనేక విమర్శలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని కూడా ఆ పార్టీకి చెందన ఒకరిద్దరు నాయకులు చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్టుగానే స్వరూపానందస్వామికి గత ప్రభుత్వం ఇచ్చిన భూములను వెనక్కితీసేసుకుంది. అయితే ఆంధప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. ప్రభుత్వంలో పాలుపంచుకుంది కూడా! ఒక హిందూ మతానికి చెందిన ఓ స్వామికి చెందిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉంది? హిందుమతానికి తామే పేటెంట్‌ అని చెప్పుకునే బీజేపీ ఈ చర్యను ఎందుకు చూస్తూ ఊరుకున్నది?

Eha Tv

Eha Tv

Next Story