ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు, ఢిల్లీ రాజకీయాలకు మధ్య సంబంధం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు, ఢిల్లీ రాజకీయాలకు మధ్య సంబంధం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంలో పవర్‌ ఉన్నవారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారపార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. భారతీయ జనతాపార్టీ మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాయి. తెలుగుదేశంపార్టీ కావొచ్చు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కావొచ్చు బీజేపీకి అంటకాగుతున్నాయి. జనసేన పార్టీ గురించి చెప్పనే అక్కర్లేదు. భారతీయ జనతాపార్టీ ఐడియాలజీ తమ ఐడియాలజీ ఒక్కటేనని చెప్పుకునే జనసేనపార్టీ ఆల్‌మోస్టాల్‌ బీజేపీ కలరేసుకుందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో తెలుగుదేశంపార్టీ, జనసేనపార్టీ, భారతీయ జనతాపార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. 2019 ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నుంచి బీజేపీ, జనసేన దూరమయ్యాయి. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంది. ఢిల్లీలో బీజేపీ నాయకులతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సన్నిహితంగా మెలగడం చూసి తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోయింది. తమ వెనుక బీజేపీ గోతులు తవ్వుతున్నదేమోనన్న అనుమానం కూడా కలిగింది. అందుకే బీజేపీని వదిలేసింది. అయితే బీజేపీని వదిలిపెట్టడానికి తెలుగుదేశంపార్టీ చెప్పిన కారణం మాత్రం ప్రత్యేక హోదా. ఏపీకి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు కాబట్టే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నామని టీడీపీ తెలిపింది. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదని టీడీపీ అప్పట్లో ఆరోపించింది. బీజేపీతో కటిఫ్‌ చెప్పిన తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీకే కాదు, చాలా మందికి బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సన్నిహితంగా ఉంటున్నదని తెలిసింది. 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 వరకు కేంద్రంలో ఉన్న బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సఖ్యతగా ఉంది. బీజేపీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినప్పటికీ ఎన్టీయేలో ఉన్న పార్టీల కంటే అత్యంత నమ్మకమైన పార్టీగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వ్యవహరిస్తూ వచ్చింది. అనేక బిల్లులకు మద్దతు ఇచ్చింది. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే అంశానికి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది సరైంది కాదని బహిరంగంగానే చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఆ నిర్ణయాన్ని స్వాగతించింది. మోటార్లకు మీటర్లు పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కేంద్రంతో ఎంత సన్నిహితంగా ఉన్నదని చెప్పడానికి ఇదో ఉదాహరణ. మరోవైపు 2019 వరకు బీజేపీపై దుమ్మెత్తిపోసిన తెలుగుదేశంపార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సైలెంటయ్యింది. బీజేపీకి సరెండరైనట్టుగా ప్రవర్తించింది. బీజేపీ నేతలను ఒక్క మాట కూడా అనలేదు. కేంద్ర నిర్ణయాలపై పల్లెత్తు మాట మాట్లాడలేదు. 2024 ఎన్నికల ముందు వరకు కూడా బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ చాలా శ్రమించింది. అన్ని విధాలా ప్రయత్నించింది. చెప్పాల్సిన వారితో బీజేపీ పెద్దలకు చెప్పించింది. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కూడా టీడీపీని బీజేపీ దగ్గరకు రానివ్వలేదన్నది అందరికీ తెలిసిన నిజం. చంద్రబాబు బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్‌ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించారు. అయినా లాభం లేకుండా పోయింది. పార్లమెంట్‌లో ఓ వేడుక సందర్భంగా అన్ని పార్టీల వారికి ఆహ్వానాలు పంపించింది బీజేపీ. పనిలో పనిగా తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం పలికింది. ఆ సందర్భంగా చంద్రబాబును మోదీ ఆప్యాయంగా పలకరించారని, పక్కకు తీసుకెళ్లి కొన్ని నిమిషాల పాటు మాట్లాడారని టీడీపీ అనుకూల మీడియా బోల్డన్నీ రాతలు రాసింది. ఈ రాతలు బీజేపీ అధినాయకత్వానికి కోపం తెప్పించాయి. మళ్లీ చంద్రబాబును దూరం పెట్టింది. చంద్రబాబునాయుడు అరెస్టయ్యి జైలులో ఉన్న సందర్భంలో కూడా అమిత్ షా అపాయింట్మెంట్‌ కోసం ఢిల్లీలో రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నారా లోకేశ్‌కు కలిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఇప్పుడు కేంద్రంలోనూ, ఏపీలోనూ ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా కూటమి పోరాడింది. ఎన్నికలు జరిగి సరిగ్గా ఆరు నెలలు అవుతోంది. ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ పెద్దలతో సఖ్యంగానే ఉంది. ఇది తెలుగుదేశంపార్టీకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది. జగన్‌పై ఉన్న కేసులను తిరిగి తోడి, ఆయనను మళ్లీ జైలుకు పంపాలని అనుకున్న తెలుగుదేశంపార్టీకి నిజంగానే ఇది మింగుడుపడటం లేదు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ఫోటో టీడీపీకి మరింత ఆందోళన కలిగించేలా చేసింది.

ehatv

ehatv

Next Story