TTD Board Member Controversy : తప్పేవరిది? టీటీడీ మౌనమెందుకు?
ఓ శ్రీవారి భక్తుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అపచారాలు జరగకుండా ఉండేందుకు, శ్రీవారికి ఎటువంటి అప్రతిష్ట రాకుండా ఉండేందుకు ఈ వీడియో చేస్తున్నా.

ఓ శ్రీవారి భక్తుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అపచారాలు జరగకుండా ఉండేందుకు, శ్రీవారికి ఎటువంటి అప్రతిష్ట రాకుండా ఉండేందుకు ఈ వీడియో చేస్తున్నా. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అప్రతిష్టపాలు కాకూడదని కోరుకుంటా. తిరుమల బాగుండేందుకు నా వీడియోలు కంటిన్యూ అవుతానే ఉంటాయి. చాగంటిని బాగా చూసుకొని ఉంటే బాగుంటుందని ఓ సూచన చేస్తే టీటీడీ నాపై కేసు పెట్టింది, లీగల్ ఫైటింగ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దాని కంటే దారుణమైన ఘటనలు టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ నరేష్(Naresh) శ్రీవారిని దర్శనం చేసుకొని బయటకు వెళ్లే సందర్భంగా ఆయనను గ్రిల్ డోర్ నుంచి బయటకు వెళ్లడాన్ని అక్కడ పనిచేస్తున్న అటెండర్ అడ్డుకున్నారు. దీంతో ఆయన అటెండర్‌పై బూతుల వర్షం కురిపించారు. దీంతో టీటీడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరగడం చాలా అరుదు. తమ సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..
