తిరుమలలో అపచారం జరిగిందని, లడ్డూ క్వాలిటీ దెబ్బతిన్నదని, లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి(Ghee)లో కల్తీ జరిగిందని

తిరుమలలో అపచారం జరిగిందని, లడ్డూ క్వాలిటీ దెబ్బతిన్నదని, లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి(Ghee)లో కల్తీ జరిగిందని పదే పదే కూటమికి సంబంధించిన నాయకులు చెబుతూ వస్తున్నారు. టీటీడీ(TTD) బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పటి ప్రభుత్వం రెస్పాన్స్‌బులిటీ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూటమి నేతల విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలు ఇలాంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అప్పటి బోర్డులో ఎవరున్నారు? అప్పటి బోర్డులో భారతీయ జనతాపార్టీకి(BJP) సంబంధించిన వారే ఎక్కువగా ఉన్నారంటూ జగన్మోహన్‌రెడ్డి (YS Jagan)చెబుతున్నారు. ఈ మేరకు మోదీ(Modi)కి రాసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వంలో ఉన్నవారు కూడా అప్పుడు బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని, బోర్డు అలాంటి తప్పులు చేసిందని, ముఖ్యమంత్రి తప్పులు చేశారని, అది కూడా ఉద్దేశపూర్వకంగా అని వమిర్శలు చేస్తున్నారు. టీటీడీ బోర్డులో పర్చేసింగ్‌ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ పర్చేసింగ్‌ కమిటీలో ఉన్నవారు ఎవరు? అప్పుడు పర్చేసింగ్‌ కమిటీలో ఉన్నవారు ఇప్పుడెందకు మాట్లాడటం లేదు? తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ కీలకమైన వ్యక్తి పర్చేసింగ్‌ బోర్డులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరి కొంత మంది కీలకమైన వ్యక్తులు కూడా పర్చేసింది కమిటీ బోర్డులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన బోర్డు సభ్యులు కూడా పర్చేసింగ్‌ కమిటీలో ఉన్నారు. ప్రధానంగా కూటమి సర్కారు గత ప్రభుత్వంపైన లడ్డూ నాణ్యత అంశానికి సంబంధించి , లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న అంశానికి సంబంధించి ఆరోపణలు చేస్తూ వస్తున్న సందర్భంలో ఓ ఇద్దరు వ్యక్తులు సైలెంట్‌గా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి రియాక్షన్‌ రావడం లేదు. ఆ ఇద్దరు కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. ఒకరు పార్థసారథి, రెండో వ్యక్తి ప్రశాంతి రెడ్డి(Prashanth Reddy). ప్రశాంతి రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె అయిదేళ్ల పాటు టీటీడీ బోర్డు మెంబర్‌గా పని చేశారు. అలాగే పార్థ సారథి కూడా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. పార్థసారథి(Pardhasaradhi) కూడా గతంలో టీటీడీ బోర్డు మెంబర్‌గా పని చేశారు. ప్రస్తుతం వీరిద్దరు టీడీపీ(TDP) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిద్దరు ఎందుకు మాట్లాడటం లేదు?



Updated On 23 Sep 2024 12:50 PM GMT
ehatv

ehatv

Next Story