ఈ వీడియో చేయడానికి కాస్త ఆలస్యం అయింది. ఎందుకు ఆలస్యమైందంటే ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో అని ఎదురుచూశాం.

ఈ వీడియో చేయడానికి కాస్త ఆలస్యం అయింది. ఎందుకు ఆలస్యమైందంటే ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వస్తుందేమో అని ఎదురుచూశాం.

గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇల్లందు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్) అభ్యర్థిగా ఆయన ఐదుసార్లు ఎన్నికయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత ఉన్న వ్యక్తిగా ఉన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కానీ చాలా సాధారణ జీవితం గడుపుతారు. టేకులగూడెం అనే పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీతాలు, భత్యాలు అన్నీ పార్టీ కోసమే ఖర్చు చేసేవారు. ఇప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారు. ఒక్క సారి గెలవగానే లక్షలు, కోట్లు సంపాదించే ఈరోజులు ఆయనలా రాజకీయనాయకులు ఉండలేరా అంటే ఉంటారు అని ఆయనను చూపించొచ్చు. అలాంటి గుమ్మడి నరసయ్యకు పార్టీలు ఏనాడూ గౌరవం తగ్గించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంతో గౌరవం ఇచ్చేవారు. 2009లో ఆయన ఓడిపోయిన తర్వాత మీలాంటి నేతలు కూడా ఓడిపోవడం బాధాకరమని గుమ్మడి నర్సయ్యతో వైఎస్‌ అన్నట్లు వార్తలు చూశాం. అటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలని పార్టీలకతీతంగా కోరుకుంటాం. అయితే ఆయన తన నియోజకవర్గంలోని సమస్యలు చెప్పుకునేందుకు సీఎం రేవంత్‌ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!



ehatv

ehatv

Next Story