కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత అరెస్ట్ లపై ఫోకస్ పెట్టింది.

కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత అరెస్ట్ లపై ఫోకస్ పెట్టింది. నారా లోకేష్‌ అమెరికాలో చెప్పినట్లు రెడ్‌ బుక్ చాప్టర్‌ 3ని ఓపెన్‌ చేసినట్లుగానే భావించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలల పాటు సోషల్ మీడియా కార్యకర్తలు, ఇతర పార్టీల మీద దాడులు జరగడం చూశాం.

కొన్ని చోట్ల హత్యలు కూడా జరగడంతో ఢిల్లీలో వైసీపీ ధర్నా నిర్వహించింది. ఆ తర్వాత రాజకీయపరమైన కేసులు, హత్యలను ఆరునెలల తర్వాత పక్కన పెట్టారు. అయితే గత 20 రోజులుగా జగన్‌ చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ క్యాడర్‌ ఉత్సాహం అయితే వచ్చింది. ఆయన వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.o చూస్తారని హెచ్చరించారు. ఎవరైతే కార్యకర్తలను ఇబ్బందులను గురిచేస్తున్నారో వారిని గుర్తుపెట్టుకుంటామని.. సప్తసముద్రాలు దాటినా పట్టుకొస్తామన్నారు. జగన్ వ్యాఖ్యలతో వైసీపీ క్యాడర్‌లో ధైర్యం వస్తోంది. ఇంతటి దారుణ ఓటమి తర్వాత ఆరేడు నెలల్లోనే వైసీపీ క్యాడర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది.

ఆరేడు నెలల్లోనే వైసీపీ క్యాడర్ యాక్టివ్‌ అయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా డైవర్షన్ స్కీం.. సూపర్‌సిక్స్ హామీల అమలు చేయలేక డైవర్షన్‌ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు అయ్యారు. దీంతో అరెస్టుల టాపిక్ మళ్లీ వచ్చింది. ఇకపై మరిన్ని అరెస్టులు ఉంటాయని టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..



ehatv

ehatv

Next Story