Journalist YNR : రాహుల్ రాలేదెందుకు.. కాంగ్రెస్‌లో గుసగుసలు..!
బీసీ కులగణన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

బీసీ కులగణన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ప్రతిష్టాత్మకంగా కులగణను తీసుకున్నారు. కులగణన చేయాలంటూ కేంద్రంపై కూడా రాహుల్ గాంధీ (Rahul Gandhi)గత కొంత కాలంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడ కులగణన గురించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేపట్టింది కాంగ్రెస్(Congress). కర్నాటక(Karnataka)లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కులగణన చేపట్టాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులగణనను చేపట్టింది. కులగణనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఎంతో కొంత పారదర్శకంగా కులగణన చేపట్టారని బీసీ కుల సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు. బీసీ జనాభా తగ్గిందని, ఓసీల సంఖ్య పెరిగిందన్న విమర్శలు వచ్చినా కూడా ఎంతో కొంత పారదర్శకంగా చేపట్టారని అన్నారు. ఆ తర్వాత కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కులాల ఆధారంగా రిజర్వేషన్లు చేపట్టాలని డిమాండ్ చేస్తే గతంలో కులాలపై లెక్కలు లేవని కేంద్రం చెప్పుకుంటూ వచ్చిన కేంద్రం, ఇదిగో మేం కులగణన చేశాం, బీసీల రిజర్వేషన్లను ఆమోదించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని కాంగ్రెస్ చెప్తోంది. అయితే ఢిల్లీ(Delhi)లో బీసీ ధర్నాచేపట్టారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా 18 పార్టీలను ఆహ్వానించిన ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు.. రాహుల్ రాకపోవడానికి కారణమేంటి.. రేవంత్(Cm Revanth Reddy)పై ఇష్టం లేకనే రాహుల్ రాలేదా.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ
