తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది.

తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకొస్తే దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu)వ్యాఖ్యానించిన అనంతరం జరిగిన పర్యవసానాలను చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో శ్యామలరావు(EO Syamalarao)కూడా నెయ్యిలో కల్తీ జరగలేదని చెప్పారు. నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబొరేటరి నెయ్యిని పరీక్షించిన మీదట ఓ రిపోర్ట్ ఇచ్చిందని, అందులో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసే అవకాశం ఉంది అంటూ తమకు రిపోర్ట్‌ వచ్చిందని శ్యామలరావు చెప్పారు. వెంటనే తాము ఆ నాలుగు నెయ్యి టాంకర్లను వెనక్కి పంపించేశామని వివరించారు. ఆ కంపెనీని బ్లాక్‌లో పెట్టామన్నారు. ఇప్పుడు ఆ కంపెనీకి చెందిన నెయ్యిని వాడారా లేదా అన్నది ఒక చర్చ అయితే వాడారు అంటూ ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులంతా మాట్లాడుతున్న తరుణంలో గుడిలో సంప్రోక్షణ కార్యక్రమం కూడా చేశారు. అపచారం జరిగిదంటూ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఈ వివాదంపై ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్ దీనిపైన విచారణ జరపబోతున్నది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని రాజకీయపార్టీలు, కొంత మంది ప్రముఖులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ వేశారు. సీబీఐతో విచారణ జరిపించాలని కొందరు, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మరికొందరు అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇంత జరుగుతోంది. చాలా చోట్ల నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం తప్పు చేసిందంటూ ధర్నాలు చేస్తున్నారు ప్రజలు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేస్తున్నారు. బీజేపీ(BJP)కి చెందిన కొంతమంది కార్యకర్తలు ఏకంగా జగన్‌(YS Jagan) నివాసంపైనే దాడికి ప్రయత్నించారు. ఇంత అలజడి దేశవ్యాప్తంగా జరుగుతోంది. గుడిలో అపచారం జరిగిందంటూ సంప్రోక్షణ కూడా చేశారు పండితులు. ఇంత చర్చ జరుగుతుంటే, ఈ స్థాయిలో వాదోపవాదాలు జరుగుతుంటే, ఈ అంశానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తుంటే తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. తెలుగు రాష్ట్రాలలో గతంలో ప్రభుత్వాలు నడవడంలో వీరి ప్రమేయం కూడా ఉండింది. ఓ రకంగా రాజగురువుల్లా వ్యవహరించారు స్వామిజీలు.. ఇప్పుడు ఆ స్వాములే ఎందుకో మౌనంగా ఉంటున్నారు. స్వామిజీల మౌనం ఎందుకు? ఎవరి కోసం మౌనంగా ఉంటున్నారు. కల్తీ జరిగిందని వారు అనుకుంటున్నారా? కల్తీ జరగలేదని భావిస్తున్నారా? ఇంతకీ ఎవరా స్వాములు? ఆ మౌనం వెనుక కారణమేమిటి? ఈ వీడియోలో చూద్దాం!



Updated On 24 Sep 2024 1:00 PM GMT
ehatv

ehatv

Next Story