Why Not CBI : సీబీఐ విచారణ వద్దంటున్నారెందుకు?
తిరుమల లడ్డూ(Tirumla laddu) వివాదానికి సంబంధించి ఏ విచారణ జరగాల్సిన అవసరం ఉంది?
తిరుమల లడ్డూ(Tirumla laddu) వివాదానికి సంబంధించి ఏ విచారణ జరగాల్సిన అవసరం ఉంది? ఎందుకు విచారణ జరగాలి? ఏం తేల్చాల్సిన అవసరం ఉంది? సీబీఐ(CBI) విచారణ జరిపించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) డిమాండ్ చేస్తూ ఉన్నారు. సీబీఐ విచారణ జరిపి దోషులెవరో తేల్చాలని జగన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ప్రధానమంత్రి మోదీకి(PM Modi) లేఖ రాస్తానంటున్నారు. ఇప్పటికే హైకోర్టులో(High court) పిటిషన్ కూడా వేశారు. అయితే ఈ వివాదం అసలు ఎక్కడ మొదలయ్యింది? సీబీఐ విచారణ సాధ్యమవుతుందా? సీబీఐ విచారణ అవసరం ఉందా?
చంద్రబాబునాయుడు కామెంట్లతో ఈ వివాదం మొదలయ్యింది. తిరుమల లడ్డూలలో కూడా జంతువుల కొవ్వును కలిపారని ఆయన మాట్లాడారు. అంటే తిరుమలలో శ్రీవారికి సంబంధించిన లడ్డూలలో జంతువుల కొవ్వు కలిపేశారు, కలిపి లడ్డూలు తయారు చేశారు, అవి భక్తులు తిన్నారు అంటూ చంద్రబాబునాయుడు అన్నారు. చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశమంతటా పెద్ద రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు మీడియా సమావేశం పెట్టి వివాదంపై వివరణ ఇచ్చుకున్నారు. ఆయన మాటల ద్వారా మనకు అర్థమయ్యిందేమిటంటే నాలుగు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. తాము జరిపిన పరీక్షలో అందులోని నెయ్యి కల్తీ అయ్యిందని తేలింది. అందుకే వాటిని వెనక్కి పంపించేశాము. అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే తిరుమల లడ్డూల తయారీకి ఈ నెయ్యిని వాడలేదని స్పష్టమవుతోంది. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 18 ట్యాంకర్లను ఇలా రిజెక్ట్ చేశారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించలేదు. ఎందుకంటే ఎలాగూ రిజెక్ట్ చేశాం కాబట్టి పరీక్షలు చేయడం దండగ అని చంద్రబాబు పాలనలో ఉన్న టీటీడీ భావించింది. తాజాగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. తిరుమల లడ్డూ క్వాలిటీ పడిపోయిందని, దాని మీద దృష్టి పెట్టమని ఈవో శ్యామలరావుకు చంద్రబాబు సూచించారు. ఆయన సూచించిన తర్వాతనే ఈ నాలుగు ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యిని ల్యాబ్‌కు పంపించామని శ్యామలరావు చెప్పుకొచ్చారు. పంపించిన క్రమంలో ఆ రిపోర్ట్ జులై 23వ తేదీన వచ్చింది. 24వ తేదీన శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టారు. నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్ తెలిపిందని, వెజటబుల్ ఫ్యాట్ కలిసిందని శ్యామలరావు తెలిపారు. అంటే జంతు కొవ్వు కలిసినట్టుగా అప్పుడు శ్యామలరావు చెప్పనే చెప్పలేదు. ఆ చర్చ కూడా రాలేదు. ఇది జరిగి రోజులు గడిచిన తర్వాత రెండు రోజుల కిందట చంద్రబాబు జంతువుల కొవ్వు కలిసిందని ఎలా చెబుతారు? ఆయన చెబుతున్నది కూడా జులై 23వ తేదీన వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే! జులై 23వ తేదీన వచ్చిన రిపోర్ట్‌ను మీడియాకు ఒక రకంగా చెప్పిన శ్యామలరావు, చంద్రబాబుకు మరో రకంగా చెప్పారా? చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తర్వాత శ్యామలరావు మరో సారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. శ్యామలరావు ఈసారి మాత్రం జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చు అని రిపోర్ట్‌లో ఉందని చెప్పారు. ఇంత గందరగోళం ఉంది కాబట్టే దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నారు. సీబీఐ విచారణను చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారో ఈ వీడియోలో చూద్దాం.