Pawan Kalyan at Kakinada Port:మనల్నెవడ్రా ఆపింది!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన సందర్భంలో అక్కడికి వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారంటూ ఓ కామెంట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మొన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన సందర్భంలో అక్కడికి వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారంటూ ఓ కామెంట్ చేశారు. పవన్ కల్యాణ్‌లాంటి వ్యక్తి, పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వంలో కీలక బాధ్యతను నిర్వర్తిస్తున్న వ్యక్తి తనను అక్కడికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ మాట్లాడటం చిన్న విషయమేమీ కాదు. పవన్ కల్యాణ్ ఎందుకు అలా మాట్లాడారో తెలియదు కానీ ఎవరు ఆయనను ఆపారు? ఎవరు ఆయనను అడ్డుకున్నారు? ఆయన ప్రభుత్వంలో, ఆయన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో ఆయనను పోర్టులో వెళ్లనీయకుండా ఆపుతారు? మనల్నెవడ్రా ఆపేది అన్న పవన్ కల్యాణ్ ఫేమస్ డైలాగ్ ఒకటుంది. ఇక్కడ ఎవరు ఆపారు ఆయనను? ఎందుకు ఆపారు? ఆపినవారికి ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరు? ఆపమని చెప్పినవారు ఎవరు? అలా ఆదేశాలు ఇచ్చినవారిపైన పవన్ ఓపినియన్ ఏమిటి? అధికారులకు ఎవరో చెప్పకుండా పవన్‌ను అక్కడికి వెళ్లొద్దు అని ఆపగలరా? ఆపే సాహసం చేస్తారా? ఆ అధికారులకు బాస్ ఎవరు? ఆయనకు డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? వీటికి జవాబు రావాల్సిన అవసరం ఉంది కదా! గతంలో పవన్ కల్యాణ్ రుషికొండ దగ్గరకు వెళ్లారు. అప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రుషికొండ భవంతిలోపలికి వెళ్లడానికి పవన్‌కు అనుమతి ఇవ్వలేదు. ఓ పార్టీ అధ్యక్షుడిని, ఓ పౌరుడిని తనను భవంతి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారా? అని మాట్లాడారు. అప్పుడు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తనను అడ్డుకున్నదని అప్పుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. రిషికొండలోని భవంతిలోపలికి వెళ్లకుండా అడ్డుకున్నది ప్రభుత్వమే అయితే కాకినాడలో షిప్ దగ్గరకు వెళ్లకుండా ఆపింది ఎవరు? ఎవరిని ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు? పవన్‌కల్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత, ఢిల్లీలో కేంద్ర నాయకత్వంతో సుదీర్ఘ మంతనాల తర్వాత, ఢిల్లీలో తన పార్టీకి చెందిన ఎంపీలకు, బీజేపీ ఎంపీలకు విందు ఇచ్చి వచ్చిన తర్వాత పవన్ నేరుగా కాకినాడ వెళ్లారు. అక్కడ బియ్యం అక్రమ రవాణాపైన మట్లాడారు. బియ్యం అక్రమ రవాణాను నిలువరించే ప్రయత్నం చేస్తుంటే అక్కడికి తనను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పారు. సివిల్ సప్లయ్ శాఖ ఆపిందా అంటే, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన పక్కనే ఉన్నారు. ఓ క్యాబినెట్ మంత్రి, పైగా డిప్యూటీ సీఎం బోటులోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారా? కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి తనను షిప్‌లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారంటే అది నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును అన్నట్టే అవుతుంది కదా! స్థానిక టీడీపీ ఎమ్మెల్యేపై కూడా పవన్ విమర్శలు చేశారు. అక్కడ అక్రమ రవాణా ఎమ్మెల్యే కంట్రోల్‌లో ఉంటుందా? ఉండదు కదా!