తిరుమల లడ్డూ అంశం ముగిసిపోయినట్టేనా? తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందా? కల్తీ జరిగిన నెయ్యితోనే లడ్డూలు చేశారా?

తిరుమల లడ్డూ అంశం ముగిసిపోయినట్టేనా? తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందా? కల్తీ జరిగిన నెయ్యితోనే లడ్డూలు చేశారా? కల్తీ జరిగితే అది ఎవరు చేశారు? కల్తీ కాకపోతే కల్తీ అయ్యిందని ఏం ఆశించి ప్రచారం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలంటే సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ జరిపి తేల్చాలి. కోట్లాది హిందువులు ఇంకా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందన్న మైండ్ సెట్‌తో ఉన్నారు. అది వారి మనస్సులోంచి తొలిగిపోవాలంటే వీలైనంత త్వరగా సిట్‌ విచారణ జరగాలి. తిరుమల లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వును కలిపారంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందన్నారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిందని, తిరుమల కొండపై అపచారం జరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ అంశంపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ను రద్దు చేస్తూ కొత్తగా సిట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో అయిదుగురు సభ్యులు ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశించి రెండు వారాలు గడిచాయి. కానీ ఇప్పటి వరకు సిట్ ఏర్పాటు కాలేదు. సిట్ ఎప్పుడు ఏర్పాటవుతుంది? ఎప్పుడు విచారణ చేస్తుంది? సిట్ విచారణ ఎప్పుడు పూర్తవుతుంది? సుప్రీం కోర్టు కూడా కాలపరిమితి విధించలేదు. గడుపు పెడితే సిట్‌పై ఒత్తిడి పెరుగుతుందని, విచారణ హడావుడిగా జరుగుతుందని భావన కావచ్చు. కనీసం సిట్ ఏర్పాటు విషయంలోనైనా సుప్రీం కోర్టు ఓ టైమ్‌బాండ్ పెడితే బాగుంటుంది. లడ్డూ పై నెలకొన్న అనుమానాలు వీలైనంత త్వరగా నివృత్తి కావాలన్నది ప్రజల కోరిక!



ehatv

ehatv

Next Story