గడచిన కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్‌.షర్మిల ఆస్తుల పంచాయితీ హాట్‌టాపిక్‌గా మారింది.

గడచిన కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, వై.ఎస్‌.షర్మిల ఆస్తుల పంచాయితీ హాట్‌టాపిక్‌గా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. లేఖాస్త్రాలను సంధించుకుంటున్నారు. ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. వాద ప్రతివాదనలను వినిపిస్తున్నారు. మొన్న షర్మిలారెడ్డి ఓ ప్రెస్‌మీట్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. 'నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు మొత్తం ఆస్తిని సమానంగా పంచాలని వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చెప్పారు' అని షర్మిల కన్నీరుకారుస్తూ చెప్పారు. ఈ విషయం అప్పుడు అక్కడ ఉన్నవారందరికీ తెలుసని చెప్పారు. షర్మిల ప్రెస్‌మీట్‌ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు విజయ సాయిరెడ్డి ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి కొన్ని మాటలు జారారు! ఇలా నోరు జారి షర్మిలకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. తన కొడుకు పెళ్లికి పిలిచేందుకు చంద్రబాబు నివాసానికి షర్మిల వెళ్లినప్పుడు ఉద్దేశపూర్వకంగానే పసుపుపచ్చ చీర కట్టుకుని వెళ్లారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి కామెంట్లు చేయడం ముమ్మాటికి తప్పే! దీన్ని సమాజం హర్షించదు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబునాయుడు కారణమని చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్‌ను కేసులలో ఇరికించడానికి కాంగ్రెస్‌ కారణమంటే ఒప్పుకోవచ్చు. చంద్రబాబు కూడా కారణమని చెబితే అవుననుకోవచ్చు. కానీ రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్‌, చంద్రబాబులు ఎలా కారణమవుతారు? జగన్‌-షర్మిల ఆస్తుల గొడవలో కాంగ్రెస్‌ను ఎందుకు లాగుతున్నారు? వైఎస్‌ మరణం వెనుక చంద్రబాబు ప్రమేయం ఎందుకు ఎంటుంది? విజయసాయిరెడ్డి కచ్చితంగా ఈ విషయంలో పొరపాటు చేశారుకోవాలి. మరోవైపు విజయసాయిరెడ్డికి కౌంటర్‌గా షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పార్టీపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఇక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ చంద్రబాబును ఆమె వెనుకేసుకురావడమే చాలా మందికి నచ్చలేదు. చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని ఆమె పలు విషయాలను మాట్లాడారు.

ehatv

ehatv

Next Story