బి.ఆర్.నాయుడు టీవీ5 చైర్మన్.. ప్రస్తుత టీటీడీ చైర్మన్. గతంలో నాలాంటి ప్రతినిధులపై వారి మీడియాలో ఓ కథనం వస్తే నేను ఒక వీడియో చేశా.

బి.ఆర్.నాయుడు టీవీ5 చైర్మన్.. ప్రస్తుత టీటీడీ చైర్మన్. గతంలో నాలాంటి ప్రతినిధులపై వారి మీడియాలో ఓ కథనం వస్తే నేను ఒక వీడియో చేశా. ఆ వీడియోలో ఆ కథనాన్ని ఖండిస్తూ బీఆర్‌నాయుడు అంటే నాకు చాలా గౌరవం ఉంది.. ఎందుకంటే నాలాంటి చాలా మంది జర్నలిస్టులకు ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. సో ఆ గౌరవం ఇప్పటికీ ఉంది. నేను ఏదో టీటీడీపై తప్పుడు ప్రచారం చేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత మీ మీడియాలో నాతో పాటు ఇద్దరు సోషల్‌ మీడియా ప్రతినిధులపై కథనం వేశారు. ఆ కథనం చూసిన తర్వాత నాకు ఇదేంటి నాయుడు గారు అని ప్రశ్నించాలి అన్పించింది. మీరు ఏదైనా అనొచ్చు కానీ మేం మిమ్మల్ని ప్రశ్నించకూడదా అని అనిపించింది. నేను ఎప్పుడూ టీవీ5 నాయుడిగారిపై ఫస్ట్ సారి స్పందిస్తున్నా. నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పార్టీని అంటగట్టే అంశాన్ని మానుకోండి. మీ చానెల్‌లో ఓ ప్రతినిధితో కథనం వేయించారు. అతనిపై నాకు ఎలాంటి కోపం లేదు.. ఎందుకంటే అతను కూడా ఓ ఉద్యోగి కాబట్టి. మీ ప్రమేయం లేకుండా ఈ కథనం రాదని నమ్ముతున్నా. మీ కథనం ప్రకారం నేను ఏ పార్టీ నుంచి డబ్బులు తీసుకొని టీటీడీపై దుష్ప్రచారం చేశారని మీరు అంటున్నారు కదా.. నేను ఓ భక్తుడిగా మాత్రమే టీటీడీ చేస్తున్న పనులపై స్పందించా.. అది దుష్ప్రచారం కాదు.. ఈ సందర్భంగా టీవీ5 చైర్మన్ బీఆర్‌నాయుడికి సీనియర్‌ జర్నలిస్ట్‌ 'YNR' విసిరిన సవాల్ ఏంటి..?

ehatv

ehatv

Next Story