తిరుమల అంశానికి సంబంధించి రకరకాల వార్తలు చూస్తున్నాం.

తిరుమల అంశానికి సంబంధించి రకరకాల వార్తలు చూస్తున్నాం. ఈ వార్తలలో క్లారిటీ వచ్చినా, కన్ఫ్యూజన్‌ పెరిగినా కోట్లాది మంది హిందువుల మనోభావాలు మాత్రం దెబ్బతిన్నాయన్న మాట మాత్రం నిజం. కోట్లాది మంది హిందువులు ఇంకా ఇప్పటికీ లడ్డూలో ఏదో కలిసిందనే అనుకుంటున్నారు. అలాంటి లడ్డూను మనం తిన్నామేమో అని సందేహపడుతున్నారు. అలాంటి లడ్డూను స్వామివారికి కూడా ఇచ్చారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి రావడానికి వెనుక ఎవరున్నారో వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ రకరకాలుగా భక్తులు ఆవేదనకు గురి కావడం చూస్తున్నాం. అయితే, ఈ అంశానికి సంబంధించి నిజానికి ఒరిజినల్‌గా, నిక్కచ్చిగా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu) స్వయంగా చెప్పిన మాట లడ్డూలలో జంతువుల కొవ్వు కలిపారు, అలాంటి కల్తీ నెయ్యితో లడ్డూలను తయారు చేశారు అని ఎన్‌డీఎ శాసనసభా పక్ష సమావేశంలో ఆయన అన్నారు. ఆ తర్వాత ఆదివారం సుదీర్ఘంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. అయిదేళ్లపాటు జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)ఏం చేశారు? ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు? టీటీడీ(TTD)ని నాశనం చేశారు అంటూ వాటన్నింటినీ ఏకరవు పెట్టారు. ఇంత చెప్పిన ఆయన లడ్డూలో జంతువుల కొవ్వును(Animal Fat)కలిపారని మాత్రం ఎందుకో అనలేదు. అపచారం చేశారు, అన్యాయం చేశారు, నాశనం చేశారు, లడ్డూ క్వాలిటీ తగ్గిపోయింది, ఇంకేదో ఇంకేదో మాట్లాడుతూ తిరుపతి లడ్డూ(Tirupati Laddu) వివాదంలో నిజాలు తెలుసుకోవడానికి సిట్‌ వేస్తున్నామని చెప్పారు. సిట్ ఎందుకు విచారణ చేయాలి? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. సాధారణంగా రెండు మూడు రాష్ట్రాలకు సంబంధించిన అంశం అయితే సీబీఐ(CBI)విచారణ చేస్తుంటుంది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి విమర్శలు చేసిన ప్రభుత్వం అది నిజమో కాదో తేల్చడానికి సీబీఐతో విచారణ జరిపించవచ్చు కదా! ఇదేదో జగన్మోహన్‌రెడ్డినో, సాధారణ భక్తులో డిమాండ్‌ చేయడం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)వంటి హిందుత్వ వాది కూడా డిమాండ్‌ చేస్తున్నారు. సీబీఐ విచారణకు చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాయాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. అనేక హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు కూడా సీబీఐ విచారణ కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. సీబీఐ విచారణ చేస్తేనే న్యాయం వెలుగులోకి వస్తుందని అంటున్నారు. మొదట మనకు తెలియాల్సిన విషయమేమిటి అంటే మనం తిన్న లడ్డూలో కల్తీ జరిగిందా? లేదా? అన్నది. చంద్రబాబు ఇలా అంటుంటే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)అయితే ఏమిటేమిటో అంటున్నారు. అసలు లడ్డూలో జంతువుల కొవ్వు కలిపేశారని అంటూ హిందూ సంఘాలను రెచ్చగొడుతున్నారు. హిందువులంతా బయటకు వచ్చి ఆందోళన చేయాలంటున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌ కల్యాణ్‌. అసలు ప్రజలు ఎవరి మీద పోరాటం చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి? అసలు ఏం జరిగిందో మీరు ఎందుకు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు? అపచారం జరిగేసింది అని ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు? హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం పెద్దలే మాట్లాడితే ఎలా?


Updated On 23 Sep 2024 2:10 PM GMT
ehatv

ehatv

Next Story