తిరుపతిలో అరాచకం జరుగుతోంది. తిరుపతిలో జరిగిన అరాచాకానికి సంబంధించిన ఫొటో నేను చూపిస్తున్నాను ఒక ఫోటో చూడండి.
తిరుపతిలో అరాచకం జరుగుతోంది. తిరుపతిలో జరిగిన అరాచాకానికి సంబంధించిన ఫొటో నేను చూపిస్తున్నాను ఒక ఫోటో చూడండి. ఈ ఫొటోలో ఉన్న మహిళ తిరుపతి మొదటి పౌరురాలు, తిరుపతి మేయర్ శిరీష. సో తను కూర్చొని ఆందోళన చేస్తోంది. పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారులు నిలబడ్డ తీరును మీరు ఒకసారి గమనించండి. తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్ శేఖర్‌రెడ్డి ఇంటిని కూల్చేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళ్లారు. ఆయన ఇల్లు అక్రమంగా నిర్మించారు, అనుమతి లేకుండా నిర్మించారనేది మున్సిపల్ అధికారుల అభియోగం. సో అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేయాల్సిందే దానిలో ఎలాంటి అనుమానం లేదు. ఈ దేశంలో అనేక చోట్ల, అనేక సార్లు అక్రమ నిర్మాణాల కూల్చివేత జరిగింది. రాజకీయ కారణాలతో కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేత జరుగుతూ ఉంటుంది. చాలా అక్రమాలు ఉన్నప్పటికీ మనకు రాజకీయంగా పడనివారిపై దృష్టి పెట్టడం, వాటిని కూల్చివేయడం చాలా చాలా సందర్భాల్లో అధికారంలో ఉన్న వారు చేయడం చూశాం. ఈ వీడియోలో మున్సిపల్ అధికారి, మున్సిపల్ మేయర్ శిరీషతో ఘర్షణ పడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా కాదు అంతకంటే కిందిస్థాయి అధికారి మేయర్‌తో వాగ్వాదం చేస్తున్నారు. మీరు చెప్తే మేం వినాలా అంటున్నారు. ఇది గతంలో మనం ఎప్పుడూ ఎక్కడా చూడనిది. ఈ వివాదంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..