ఈ వీడియో కాస్త కళ్లు పెద్దవి చేసి చూడండి.. చెవులు నిక్కరించుకొని వినండి. టీడీపీ అఫీషియల్‌ హ్యాండిల్‌ నుంచి ఒక ట్వీట్‌ వచ్చింది.

ఈ వీడియో కాస్త కళ్లు పెద్దవి చేసి చూడండి.. చెవులు నిక్కరించుకొని వినండి. టీడీపీ అఫీషియల్‌ హ్యాండిల్‌ నుంచి ఒక ట్వీట్‌ వచ్చింది. ఇది పొరపాటుగా చేసిందేమో.. డిలీట్ చేస్తుందేమో అనుకొని ఆగాను. ఈ ట్వీట్ అధికార టీడీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చింది. ఈ ట్విట్టర్‌లో దిమ్మతిరిగిపోయే మ్యాటర్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్‌ పాలసీ చేంజ్ చేశారు. లిక్కర్‌పై జే ట్యాక్స్‌ వేశారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు కొత్త పాలసీ తెచ్చారు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా జే ట్యాక్స్‌తో భారీగా కమీషన్లు పొందారనేది దాని సారాంశం. జే ట్యాక్స్‌ ద్వారా గత ప్రభుత్వ హయాంలో వచ్చిన డబ్బును తాడేపల్లి కొంపలో 200 కౌంటింగ్ మెషిన్లు, 900 మంది సిబ్బందితో 24*7 లెక్కించేవారని దాని సారాంశం. అంటే ఈ ట్వీట్‌ ప్రకారం మనం ఎనాలిస్ చేస్తే ఒక్క నెలలో లిక్కర్ కమీషన్‌ ద్వారా జగన్‌ సంపాదించింది అక్షరాల 10 లక్షల కోట్లకుపైమాటే.. అంటే ఏడాదికి 130 లక్షల కోట్లు.. అంటే భారతదేశం మూడేళ్ల బడ్జెట్‌.. ఒక్క జగన్‌ మూడు నెలలకు సంపాదించిన కమీషన్‌తో ఒక ఏడాది భారతదేశం బడ్జెట్‌కు సమానం.. టీడీపీ అఫీషియల్ ట్వీట్‌పై సీనియర్ జర్నలిస్టు 'వైఎన్ఆర్' విశ్లేషణ


ehatv

ehatv

Next Story