గత రెండు రోజులుగా సింగర్ మంగ్లీపై టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు.

గత రెండు రోజులుగా సింగర్ మంగ్లీపై టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా సింగర్ మంగ్లీ శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యానారాయణస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఆమె ఫొటోలు దిగారు. ఈ విషయంపై టీడీపీ సోషల్‌ మీడియా విరుచుకుపడింది. గతంలో వైసీపీకి పనిచేసిన మంగ్లీకి దర్శనం ఎలా కల్పిస్తారని.. ఆమెతో ఫొటోలు ఎలా దిగుతారని రామ్మోహన్నాయుడును ట్రోల్ చేస్తున్నారు. లోకేష్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా పాల్గొన్న ఉదయభానును కూడా అప్పుడు వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తే నేను కూడా వీడియో చేశాను. అప్పుడు ఉదయభాను వృత్తిలో భాగంగానే ఆ కార్యక్రమంలో పాల్గొందని దానికి ట్రోల్ ఎందుకు చేయడం అని నేను ప్రశ్నించాను. ఇప్పుడు కూడా మంగ్లీ గురించి టీడీపీ సోషల్‌ మీడియాలో విచక్షణ లేకుండా పోస్టులు చేస్తున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ

ehatv

ehatv

Next Story