YNR : నవయుగకు దాసోహం..టీడీపీ పత్రిక వితండ వాదం..!
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వం చెప్తున్నదేంటి. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వం.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటూ చెప్తూ ఉంది.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూటమి ప్రభుత్వం చెప్తున్నదేంటి. పోలవరం ఆలస్యానికి గత ప్రభుత్వం.. గత ప్రభుత్వం, గత ప్రభుత్వం అంటూ చెప్తూ ఉంది. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఘంటా బజాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఓ నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ టెండర్లలో భాగంగా నవయుగ కంపెనీకి రూ.1730 కోట్లు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది చాలా తప్పుడు నిర్ణయం. దీనిపై స్పందించేందుకు వైసీపీ నేతలకు తీరిక దొరకడం లేదు. ఇది ఏ మాత్రం సమర్థించే నిర్ణయం కాదు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విరుద్ధంగా జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందిన పత్రిక సమర్థిస్తూ ఈరోజు ఓ కథనాన్ని ప్రచురించింది. జగన్ రివర్స్ దెబ్బ అంటూ కథనం వేసింది. అసలు ఏముంది ఆ కథనంలో.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
