మార్గదర్శి చిట్‌ఫట్‌ కేసుకు సంబంధించిన విషయాలను రెండు దశాబ్దాలుగా కేసును చూస్తూనే ఉన్నాం.

మార్గదర్శి చిట్‌ఫట్‌ కేసుకు సంబంధించిన విషయాలను రెండు దశాబ్దాలుగా కేసును చూస్తూనే ఉన్నాం. మార్గదర్శికి వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ న్యాయపోరాటం చేస్తున్నారు. రెండు దశాబ్దాలపాటు కేసుపై చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని.. హిందూ అన్‌ డివైడెడ్ ఫ్యామిలీ ఫర్మ్‌గా ఉన్న మార్గదర్శికి డిపాజిట్లు సేకరించేందుకు అనుమతి లేదనేది వాదన. ఇప్పటికిప్పుడు మార్గదర్శిపై నేరం రుజువుకానప్పటికీ కోర్టులో విచారణ జరుగుతోంది. శిక్ష వేయకపోయినప్పటికీ కోర్టుల్లో తప్పులు బయటపడ్డాయి.

గతంలో మార్గదర్శి సంస్థపై ఆదాయపు పన్నుశాఖ కూడా జరిమానా విధించింది. ఆర్‌బీఐ చెప్తున్న ప్రకారం 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని మార్గదర్శిపై ఆర్‌బీఐ కోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆస్తుల అటాచ్ జరిగింది. ఏపీ, తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. కొందరు మార్గదర్శి కస్టమర్లు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇన్ని జరిగిన తర్వాత మార్గదర్శి తప్పు చేయలేదని ఎవరైనా ఎలా చెప్తారు. ఇదే అంశంపై పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడారు. శారదా స్కాం కంటే మార్గదర్శి అతిపెద్ద స్కాం అని ఆయన పార్లమెంట్‌లో అన్నారు. మార్గదర్శి అక్రమాలపై ప్రశ్నిస్తుంటే తమపై ఈనాడులో తప్పుడు కథనాలు రాస్తున్నారని మిథున్‌రెడ్డి విమర్శించారు. దీనిపై టీడీపీ ఎంపీలు ప్రెస్‌మీట్ పెట్టారు. మార్గదర్శిని ఎలా తప్పు పడతారు అని అడిగారు. టీడీపీ ఎంపీల ప్రెస్‌మీట్‌పై సీనియర్‌ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!


ehatv

ehatv

Next Story