Journalist YNR : మోడీని విలన్ అంటున్న టీడీపీ మీడియా..!
భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియాకు ఇష్టం ఉండదు.
భారతీయ జనతా పార్టీ అంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియాకు ఇష్టం ఉండదు. 2018 నుంచి 2019 వరకు బీజేపీపై ఏ స్థాయిలో విషం కక్కారో చూశాం. ఏ స్థాయిలో విలన్‌గా చూపించాలనుకున్నారో ఆ స్థాయిలో చూపించారు. బీజేపీ నాయకులపై భౌతిక దాడులను కూడా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ మీడియా. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గురించి ఒక వార్త రాయడానికి వణికిపోయారు. నేరుగా బయటకొచ్చి ఒక్క వార్త కూడా రాయలేకపోయారు. భారతీయ జనతాపార్టీని అంటే ఏమన్నా చేస్తారేమో, బీజేపీ గురించి మాట్లాడితే ఏమంటారో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. బీజేపీ పట్ల బయటకు కనపడకుండా భయం, భక్తి నటిస్తూ వచ్చింది. 2024 ఎన్నికల సమయానికి టీడీపీ, బీజేపీ ఒక్కటి కావాలి, ఒక్కటి కాకపోతే సస్టెయిన్ కాలేము అని ముందుగానే ఊహిస్తూ వచ్చింది. 2024 వరకు వైసీపీని తీవ్రంగా విమర్శిస్తూ వార్తలు రాసుకొచ్చింది. బీజేపీ, వైసీపీ పట్ల టీడీపీ వైఖరిపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!