ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి ఇదో సంచలన వార్త!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి ఇదో సంచలన వార్త! ఆంధ్రప్రదేశ్‌(AP)లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు డిసెంబర్‌ 20వ తేదీన జరగబోతున్నాయి.ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కాబోతున్నది. ఈ మూడు స్థానాలు ఎవరికి దక్కబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. రకరకాల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. ఇందులో ఎవరికి దక్కుతుందన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మూడింటిలో ఒకటి జనసేన పార్టీకి కేటాయిస్తారని, ఆ పార్టీ తరఫున నాగబాబు(Nagababu) ఎన్నికల బరిలో దిగుతారని వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ(BJP) నుంచి బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య (R krishnaih)పోటీ చేస్తారని అంటున్నారు. అయితే జనసేన నుంచి నాగబాబుకు టికెట్‌ రాకుండా కొంత మంది గట్టిగానే ప్రయత్నిస్తున్నారట! ఇందులో భాగంగానే లింగమనేని రమేశ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇలాంటి విషయాలలో చంద్రబాబు చాలా చాలా సీక్రసీ మెయింటైన్‌ చేస్తారు. నాన్చి నాన్చి చివరకు ఏదో ఒకటి చెబతారు. చంద్రబాబు(Chandra babd) ఇనుమునైనా నాన్చుతారట! అలాగని క్యాడర్‌ అంటోంది. అదలా ఉంచితే ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో రెండు తమకే ఇవ్వాలంటూ భారతీయ జనతా పార్టీ అడుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము ధారాళంగా త్యాగం చేశామని, తక్కువ స్థానాలకే ఒప్పుకున్నామని బీజేపీ అంటోంది. కూటమి అధికారంలోకి రావాలి కాబట్టి ఆ సమయంలో రాజీపడ్డామని చెబుతోంది. ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ బలం పెరగాలి కాబట్టి రెండు స్థానాలను తమకే ఇవ్వాలని వాదిస్తోంది. కూటమిలో ఉన్న మూడు పార్టీలో తలా ఒక్కటి తీసుకుంటాయా? ఎప్పటిలాగే జనసేన త్యాగం చేస్తుందా? తమకు రాజ్యసభ అవసరం లేదని బీజేపీకి కేటయిస్తుందా? అన్నది చూడాలి. బీజేపీ ఒకే సీటు తీసుకోవాల్సి వస్తే ఆ స్థానం నుంచి పోటీ చేసేది ఎవరు? అన్న దే ఇప్పుడు చర్చ. ఆర్‌.కృష్ణయ్య పేరు తెరమీదకు ఎలా వచ్చిందో తెలియదు. మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సుజనా చౌదరి రాజ్యసభ రేసులో ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వం తీసుకుని కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్లాలన్నది సుజనా చౌదరి ఆలోచన. ఆయన కేంద్ర మంత్రి అయితే రాష్ట్రానికి ఎంతో లాభమని సన్నిహితులు చెబుతున్నారు.

ehatv

ehatv

Next Story