తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది.

తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూలో జంతువుల మాంసం కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ తిరుమల వెళ్లారు. గత ప్రభుత్వం హయాంలో అపచారం జరిగిందని అన్నారు. అపచారానికి బదులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేశారు పవన్‌ కల్యాణ్‌. ఆ తర్వాత తిరుమలలో లడ్డూ కల్తీ జరిగిందా లేదా అన్నదానిపై రాజకీయ దుమారం చెలరేగింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. లడ్డూలో కల్తీ జరిగిందని ఆధారాలు ఉంటే చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దాని తర్వాత లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. అయితే సీబీఐ విచారణలో తేలిందేంటి అనే అంశంపై సీనియర్‌ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!


ehatv

ehatv

Next Story