JD Lakshmi Narayana : వైఎస్ పేరుతో ఉంటేనే షర్మిలకు ఆస్తులు..? జేడీ ఏం చెప్పారంటే..!

షర్మిల(YS Sharmila), జగన్‌(YS Jagan) ఆస్తుల వివాదం(assests dispute) వారి కుటుంబానికి చెందినదని సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ(JD lakshmi naryana) తెలిపారు. కానీ వాళ్లు సెలెబ్రిటీలు కనుక ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిందన్నారు. ప్రతీ కుటుంబంలో ఇలాంటివి ఉంటాయని..అయితే మన దేశంలో ఆస్తుల పంపకాలపై వివిధ మతాలకు, వివిధ రకాలుగా నిబంధనలున్నాయని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. తండ్రి ఆస్తులు వీలునామా రాసి చనిపోతే దాని ప్రకారమే ఆస్తులు పోతాయన్నారు. లేదా తండ్రి ఆస్తి ఆయన తదనంతరం భార్య, కొడుకు, కూతురుకు సమానంగా వెళ్తాయన్నారు. ఇదే జగన్‌, షర్మిల ఆస్తుల కేసు వివాదానికి వర్తిస్తుందన్నారు. సరస్వతి షేర్లపై(Saraswathi shares) ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు(Telangana high court) స్టేటస్‌ కో ఇచ్చిందని.. షేర్ల బదిలీపై ఎన్‌సీఎల్‌టీదే(NCLT) తుది నిర్ణయంగా ఉండబోతుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అయితే షర్మిల, జగన్‌ ఆస్తుల వివాదంపై మరింత లోతైన విశ్లేషణ జర్నలిస్ట్ 'YNR'తో(Journalist YNR) జేడీ లక్ష్మీనారాయణ రియాల్టీ చెక్‌లో..!


Updated On 31 Oct 2024 6:59 AM GMT
Eha Tv

Eha Tv

Next Story